మొత్తానికి వర్మ పనులకు జనాలకు అసహ్యమేస్తోంది. అరియానా (Ariyana) దగ్గర నుండి అషురెడ్(Ashu Reddy)డి.. ఈ రోజు మరో అమ్మాయితో వర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. అయినా వర్మకి ఇలాంటి వీడియోలు సర్వసాధారణమై పోయాయి. లాక్ డౌన్ కి ముందు మియా మాల్కోవా, శ్రీ రాపాక, నైనా గంగూలీ, మధ్యలో అప్సరా రాణి… ఇలా వర్మ దిక్కుమాలిన సినిమాల్లో కనిపించి కనుమరుగై పోయిన తారలు ఎందరో ఉన్నారు.
అయినా కొత్త భామలు మాత్రం ఇంకా వర్మనే నమ్మడం నిజంగా విచిత్రమే. మరి వర్మ.. బూతు వర్మగానే మిగిలిపోతాడా ? లేక మళ్ళీ తనలోని ఫిల్మ్ మేకర్ ను నిద్ర లేపుతాడా ? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం వర్మ పోస్ట్ చేసిన ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్ బుక్ అకౌంట్ లోని వీడియో బాగా వైరల్ అవుతుంది. బర్త్ డే జరుపుకుంటున్న అమ్మాయితో వర్మ విన్యాసాలు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
అసలు ఎవరు ఏమనుకుంటారో ? అని ఇలా పక్కోడు ఎదురింటోడు ఫీలింగ్స్, కామెంట్స్ ఏ మాత్రం పట్టించుకోని వర్మ ఎంతైనా డిఫరెంటే, అతని ఆలోచనా విధానం ప్రత్యేకమే. అందుకే, ఆర్జీవీ అనే ఈ వింత జీవి ఏమి చేసినా సరి కొత్తగా ఉంటుంది. అయితే ఒకప్పుడు క్రియేటివిటీకి వర్మ మారు పేరు. ఇప్పుడు ప్రమోషన్స్ కి మాత్రమే పరిమితం అయిపోయిన సాధారణ దర్శకుడు.
తెలివి మీరి ఉన్న మతి పోయినట్టు ఉంది వర్మ ప్రస్తుత పరిస్థితి. అసలు తన చిత్రాలను ఎవరైనా చూస్తున్నారా ? అసలు వాటికి రెస్పాన్స్ వస్తుందా ? లేదా ? అన్నది కూడా పట్టించుకునే స్థితిలో లేడు వర్మ. తన చిత్రాల జయాపజయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు ఉంది ఆర్జీవీ వ్యవహార శైలి. ఏది ఏమైనా వర్మ మన కర్మ.