T20 World Cup 2024: ప్రస్తుతం ఇండియన్ టీం తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతుంది. ఫార్మాట్ ఏదైనా తన ప్రత్యేకతను చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ గెలుపు తీరాలకు చేరుస్తుంది. ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరం జూన్ లో జరిగే టి20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ టీమ్ ని సెలెక్ట్ చేసే పని లో ఉన్నట్టు గా తెలుస్తుంది. ఎందుకంటే మన టీం లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా అద్భుతమైన ఫామ్ ని కనబరుస్తూ తనకంటూ ప్రత్యేకతను అయితే చాటుకుంటున్నారు.
కాబట్టి టీం లో ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే దానిపైన ఇప్పటి నుంచే బిసిసిఐ చాలా కసరత్తులైతే చేస్తుంది. ఈసారి ఇండియన్ టీం కప్పు గెలవాలంటే మన ప్లేయర్ల సెలక్షన్ అనేది చాలా క్లారిటీ గా ఉండాలి అంటూ మరి కొంతమంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ వరల్డ్ కప్ కోసం కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే ప్రశ్న కూడా చాలా రోజుల నుంచి అందరి మది లో మెదులుతుంది. ఇక వీటన్నింటికీ తెరదించుతూ బిసిసిఐ సెక్రటరీ అయిన జై షా ఒక క్లారిటీ ఇచ్చాడు. 2024 లో జరిగే టి20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు అంటూ ఒక ఈవెంట్లో ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రోహిత్ శర్మ అయితేనే టీమ్ ని విజయ తీరాలకు చేరుస్తాడు, అనే ఒక కాన్ఫిడెంట్ అందరిలో ఉంది అంటూ రోహిత్ గురించి తను చాలా పాజిటివ్ గా మాట్లాడటం రోహిత్ అభిమానులకి సంతోషాన్ని కలిగించింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టి20 ఫార్మాట్ లో ప్రతి టీం కూడా అద్భుతమైన ఫామ్ ని కనబరుస్తూ ముందుకు సాగుతున్నారు.
కాబట్టి మన టీం వాళ్ల టీమ్ లను మించేలా ఉండాలి అంటే ఇంకా చాలా కసరత్తులు చేయాల్సిందే అంటూ మాజీ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.