Homeఎంటర్టైన్మెంట్Anupama Parameswaran: తెగించి పెదాలు జుర్రేసిన అనుపమకు హిట్ దక్కేనా... లేదంటే పడ్డ కష్టమంతా బూడిదలో...

Anupama Parameswaran: తెగించి పెదాలు జుర్రేసిన అనుపమకు హిట్ దక్కేనా… లేదంటే పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే!

Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. పరిశ్రమలో హోమ్లీ హీరోయిన్స్ రాణించిన దాఖలాలు తక్కువే. ఈ జనరేషన్ లో అయితే ఒకరో ఇద్దరో ఉన్నారు. కమర్షియల్ చిత్రాల్లో గ్లామరస్ రోల్స్ చేసే హీరోయిన్స్ కోట్లు ఆర్జిస్తున్నారు. అలాగే వాళ్ళ కెరీర్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని లేటుగా అర్థం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్… బోల్డ్ నెస్ కి తెరలేపింది. ముద్దు సన్నివేశాల్లో అభ్యంతరం లేకుండా నటిస్తుంది.

దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరో నటించిన రౌడీ బాయ్స్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీలో లిప్ లాక్ సన్నివేశాల్లో పాల్గొంది. గతంలో అనుపమ కనీసం స్కిన్ షో చేసింది లేదు. అలాంటి హీరోయిన్ ఒక్కసారిగా లిప్ లాక్ సన్నివేశాలు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అనుపమ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే రౌడీ బాయ్స్ ఏమంతగా ఆడలేదు. అనుపమ హద్దులు చెరిపేసినా ఫలితం దక్కలేదు.

రౌడీ బాయ్స్ లో ముద్దు సీన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. టిల్లు స్క్వేర్ లో అమ్మడు మరింతగా రెచ్చిపోయింది. హీరో సిద్ధుతో కారులో రొమాన్స్ చేసింది. సుదీర్ఘమైన లిప్ లాక్ సీన్స్ చేసింది. టిల్లు స్క్వేర్ లో లెక్కకు మించిన ముద్దు సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే అనుపమ బోల్డ్ గా నటించనుందనే అంచనాకు జనాలు వచ్చారు. అయితే ఈ రేంజ్ లో ఊహించలేదు. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ముద్దు సన్నివేశాలు చేసింది.

ఈ దెబ్బతో అనుపమ హోమ్లీ ఇమేజ్ మటాష్ అని చెప్పొచ్చు. అయితే టిల్లు స్క్వేర్ విజయం సాధిస్తేనే ఆమె కష్టానికి ఫలితం ఉంటుంది. ఇంత చేసి మూవీ ప్లాప్ అయితే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూస్తే… పక్కా బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. డీజే టిల్లు కి మించిన రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ టిల్లు స్క్వేర్ లో జోడించారు. టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదల కానుంది. మల్లిక్ రామ్ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు.

Tillu Square - Theatrical Trailer | Siddu, AnupamaParameswaran | MallikRam | March 29th Release

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
Oktelugu Epaper
Exit mobile version