Virat Kohli: టీమిండియాలో ఏం జరుగుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా తెలియకుండా పలు నిర్ణయాలు జరిగిపోతున్నాయి. దీంతో కెప్టెన్ ప్రాధాన్యాన్ని తగ్గించారా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఓ వైపు టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్, న్యూజీలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కోహ్లిపై సహజంగా విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లి ప్రకటించడంతో వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లిని తప్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మాటకు విలువ ఇవ్వడం లేదని తెలుస్తోంది. తాజాగా టీమిండియా కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సందర్భంలో కోహ్లికి మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
ప్రస్తుతం విరాట్ కోహ్లి రాహుల్ ద్రవిడ్ తో కలిసి పనిచేస్తాడా? లేదా అని అందరిలో అనుమానాలు నెలకొన్నాయి. గతంలో ఏ నిర్ణయం తీసుకున్నా కెప్టెన్ అభిప్రాయాన్ని పరిగనణనలోకి తీసుకునే వారు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లికి చెప్పకుండా బీసీసీఐ నిర్ణయం ప్రకటిండంతో అందరిలో అయోమయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఏ మేరకు స్పందిస్తారో అనే ప్రశ్న అందరిలో వస్తోంది.
టీ20 వరల్డ్ కప్ తరువాత రవిశాస్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ నియామకం జరిగినట్లు చెబుతున్నారు. కానీ కోహ్లి అభిప్రాయానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం టీమిండియాలో ఏం జరగబోతోందనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి.
Also Read: కెప్టెన్సీకి కోహ్లీ ఎందుకు రాజీనామా చేశాడు.. ఎవరైనా ఫిర్యాదు చేశారా? బీసీసీఐ క్లారిటీ