Deepawali: దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదైలంది. ఇంటి నిండా బంధువులు పిల్లల కోలాహలంతో హడావిడిగా ఆనందంతో వెలిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో కలిసి అల్లు ఫ్యామిలీ దీపావళి సెలెబ్రేషన్ల్ అంగరంగ వైభవంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు అల్లు అర్జున్, రామ్చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో మెగా- అల్లు ఫ్యామిలీలోని యంగర్ జనరేషన్ మొత్తం ఒకే చోటుకు చేరినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నిహారిక, వైష్ణవ్ తేజ్, అల్లు బాబీ, శ్రీజ ఇతర కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. అలాగే మెగా.. అల్లు కుటుంబాలకు సంబంధించిన సన్నిహితులు.. బంధువులు ఈ వేడుకలలో పాల్గొన్నట్లుగా సమాచారం.

కాగా, ప్రస్తుతం రాజౌళి దర్శకత్వంలో చరణ్ ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ప్రస్తుతం టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నారు ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ నెట్టింట్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆటు రామ్ చరణ్, ఇటు బన్నీ ఇద్దరూ తమ కెరీర్లో ఎప్పుడూ చేయని విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.