Rohit Sharma: వన్డే వరల్డ్ కప్ లో ఇండియన్ టీం కి సారథి గా వ్యవహరించిన రోహిత్ శర్మ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం వల్ల రోహిత్ శర్మ కొంతవరకు నిరాశకి గురయ్యాడు ఇక దానికి తోడుగా ఇప్పుడు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా రోహిత్ శర్మని కెప్టెన్సీ బాధ్యతలనుంచి తొలగించి హార్దిక్ పాండ్య కి కెప్టెన్ గా భాద్యతలను అప్పగించడం పట్ల రోహిత్ శర్మ అభిమానులు చాలా వరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమం లో రోహిత్ శర్మ అభిమానులకు బిసిసిఐ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అది ఏంటి అంటే వచ్చే సంవత్సరం జూన్ లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనున్న టి 20 వరల్డ్ కప్ లో ఇండియా సారధిగా రోహిత్ శర్మ ని నియమించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న కెప్టెన్లు అందరిని పరిశీలిస్తున్న క్రమంలో అందరికంటే రోహిత్ శర్మ చాలా ముందు వరుసలో ఉన్నాడు అంటూ బీసిసిఐ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పడంతో రోహిత్ శర్మ అభిమానులు కొంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని బీసీసీఐ చెప్పిన గుడ్ న్యూస్ తో రోహిత్ శర్మ అభిమానులు అయితే మంచి ఆనందంతో ఉన్నారు…ఇక ఇదే క్రమంలో రోహిత్ శర్మ ని ట్రేడింగ్ విధానం ద్వారా తీసుకోవడానికి ఢిల్లీ, హైద్రాబాద్ టీంలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రోహిత్ శర్మ ఏ టీంలోకి వెళ్తాడు అనే అతని నిర్ణయం మీదనే మొత్తం ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికైతే ఢిల్లీ టీం కూడా ట్రేడింగ్ విధానం ద్వారా రోహిత్ శర్మని తీసుకోవడానికి చర్చలు అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
మరో విషయం ఏంటంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ లోనే ఉంటాడా లేదంటే వేరే టీమ్ లోకి వెళ్లి అక్కడ కెప్టెన్ గా తన బాధ్యతను స్వీకరించి అక్కడ తన సత్తా చాటి ఆ టీమ్ కి కప్పు అందించి మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈనెల 19వ తేదీన మినీ ఆక్షన్ జరుగుతున్న నెపథ్యం లో మినీ ఆక్షన్ తర్వాత రోహిత్ శర్మ తన డిసిజన్ ని మార్చుకొని వేరే టీంలోకి వెళ్తాడా లేదా అదే టీంలో ప్లేయర్ గా కంటిన్యూ అవుతాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది…