Bavuma’s injury: డబ్ల్యూటీసీ తుది పోరులో ప్రొటీస్ జట్టు విజయం దిశగా సాగుతోంది. మరో 69 పరుగులు చేస్తే కంగారు జట్టు విధించిన లక్ష్యాన్ని సాధిస్తుంది. తద్వారా ఐసీసీ టెస్ట్ గదను సొంతం చేసుకుంటుంది. ఇప్పటివరకు చూసుకుంటే దక్షిణాఫ్రికా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటికే మూడు రోజులు ఆట పూర్తయింది. శనివారం నాలుగు రోజు ఆట ప్రారంభం కానుంది. ఇప్పటికే మార్క్రం సెంచరీ చేశాడు.. కెప్టెన్ బవుమా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు ఇప్పటివరకు 143 పరుగులు జోడించారు. వీరిద్దరి దూకుడు చూస్తే ఇంకా ఎక్కువ పరుగులు చేసే అవకాశం కనిపిస్తోంది.. పిచ్ కూడా బౌలర్లకు అంతగా అనుకూలించడం లేదు. మూడోరోజు కంగారు బౌలర్లు రెండు వికెట్లు మాత్రమే పడగొట్టడం విశేషం. పైగా లార్డ్స్ లో వాతావరణం పొడిగా ఉంది.. ఉష్ణోగ్రత అంచనాలు వేసిన స్థాయిలో లేకపోయినప్పటికీ.. బంతి అనుకూనంత స్థాయిలో స్వింగ్ కావడం లేదు. ఫలితంగా కంగారు జట్టు కోరుకున్న విధంగా వికెట్లు నేలకూలడం లేదు. మ్యాచ్ స్వరూపాన్ని చూస్తుంటే దక్షిణాఫ్రికాకు అనుకూలంగా కనిపిస్తోంది.. మొత్తంగా ఏదైనా అద్భుతం చోటు చేసుకుంటే తప్ప కంగారు జట్టు గెలిచే పరిస్థితి కనిపించడం లేదు.
Read Also: మూడుసార్లు ప్రయత్నించింది.. నాలుగోసారి అంతం చేసింది: మేఘాలయ ఘటనలో షాకింగ్ నిజం!
కెప్టెన్ ఆడతాడా
శుక్రవారం నాటి మ్యాచ్లో ప్రోటీస్ జట్టు కెప్టెన్ బవుమా తీవ్రంగా ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. అతడి కాలికి గాయమైనట్టు తెలుస్తోంది. అయినప్పటికీ జట్టు కోసం అతడు అలానే బ్యాటింగ్ చేశాడు. ఏ ముహూర్తంలో అయితే స్మిత్ తన క్యాచ్ జారవిడిచాడో.. అప్పటినుంచి బవుమా అత్యంత జాగ్రత్తగా ఆడాడు. కంగారు జట్టు బౌలర్లకు ఏమాత్రం అలాంటి అవకాశం మరొకటి ఇవ్వలేదు. కాలు గాయం వల్ల ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ.. పరుగు తీయాలంటేనే కష్టం అవుతున్నప్పటికీ.. బవుమా అలానే బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు కొట్టకుండా.. సింగిల్స్, క్విక్ డబుల్స్ తీస్తూ అదరగొట్టాడు. అయితే శుక్రవారం గాయంతో ఇబ్బంది పడినప్పటికీ బవుమా అలానే బ్యాటింగ్ చేశాడు. అయితే శనివారం అతడు బ్యాటింగ్ చేస్తాడా? మ్యాచ్లో ఆడతాడా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. జాతీయ మీడియాలోనూ ఇదే తీరుగా వార్తలు వచ్చాయి. అయితే అతను ఆడతాడని..గాయం నుంచి కోలుకున్నాడని.. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది.
Read Also: జ్వరం టాబ్లెట్స్ వాడే వారందరూ ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..
” అతడు గాయంతో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కాకపోతే కోకుకున్నాడు. సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు గొప్పగా ఆడే విషయంలో తన వంతు పాత్ర పోషించాడు. శనివారం అతడు ఆడుతాడు. దానికి సంబంధించి పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాడని” దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ వెల్లడించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత బవుమాకు వైద్యులు చికిత్స చేశారు. ఆ తర్వాత అతడు కోలుకున్నాడు. మైదానంలో మెరుగ్గా ప్రాక్టీస్ చేశాడు. బ్యాటింగ్ కూడా స్వేచ్ఛగా చేసి ఆకట్టుకున్నాడు.