Viral video : బంగ్లాదేశ్ వేదికగా ఆ జట్టుతో సౌత్ ఆఫ్రికా తలపడుతోంది. ఈ రెండు జట్లు ప్రస్తుతం రెండవ టెస్ట్ ఆడుతున్నాయి. తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ రెండు జట్లు రెండవ టెస్టు లో తల పడుతున్నాయి. రెండవ టెస్ట్ మ్యాచ్ లో తొలుత సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 144.2 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 575 రన్స్ చేసి, డిక్లేర్ ఇచ్చింది. టోనీ 177, ట్రిస్టన్ స్టబ్స్ 106, మల్డర్ 105* పరుగులతో సత్తా చాటారు. సేను రాన్ ముతు స్వామి 68, డేవిడ్ బెడింగ్ హమ్ 59 రన్స్ చేసి ఆకట్టుకున్నారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 5/198, నహీద్ రాణా 1/83 సత్తా చాటారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు తొలి బంతికే 10 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాటర్ సేను రాన్ ముత్తుస్వామి నిబంధనలు అతిక్రమించాడు. అదేపనిగా మధ్య పిచ్ పై పరుగులు పెట్టాడు. అతడి వ్యవహార శైలి అంపైర్లకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో అతడిని మందలించారు. అయినప్పటికీ అతడు అతడు అలాగే వ్యవహరించాడు. ఫలితంగా అంపైర్లు క్రికెట్ నిబంధనలను అనుసరించి సౌతాఫ్రికా జట్టుకు 5 పరుగులను పెనాల్టీగా విధించారు. దీంతో బంగ్లాదేశ్ కు ఎటువంటి కష్టం లేకుండా అయిదు పరుగులు వచ్చాయి. రబాడా ప్రారంభ ఓవర్ వేశాడు. అతడు వేసిన తొలి బంతిని బంగ్లాదేశ్ ఓపెనర్ షెడ మన్ ఇస్లాం వదిలేశాడు. అది కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. ఇక రెండవ బంతి ని వేసే క్రమంలో ఓవర్ స్టెప్ అయ్యాడు. ఫలితంగా అది నోబాల్ అయ్యింది. ఆ బంతి వికెట్ కీపర్ ను దాటిపోయింది. బౌండరీ వద్దకు వెళ్ళిపోయింది. దీంతో బంగ్లాదేశ్ జట్టుకు 5 పరుగులు సమకూరాయి. ఇలా పది పరుగులు ఒక్క బంతికే వచ్చాయి. అది కూడా బంగ్లాదేశ్ బ్యాటర్ టచ్ చేయకుండానే..
ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం.. 41.2.11 నిబంధనను అనుసరించి దక్షిణాఫ్రికా జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీని ఫీల్డ్ ఎంపైర్ విధించాడు. ఈ నిబంధన ప్రకారం పదేపదే తప్పు చేసిన ఆటగాడిని అంపైర్ పలుమార్లు హెచ్చరిస్తారు. దానికంటే ముందు అతడిని మందలిస్తారు. ఆ తర్వాత జట్టులోని ఆటగాళ్లను పిలుస్తారు. కెప్టెన్ ను ముందు వరుసలో ఉంచి చివరి హెచ్చరిక జారీ చేస్తారు. ఇక అప్పటికి కూడా అదే తప్పు పునరావృతం అయితే 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. దీనికి తోడు రబాడా నో బాల్ వేయడంతో బంగ్లాదేశ్ జట్టుకు ఉదారంగా పది పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత రబాడా మైదానంలో విజృంభించాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 38 పరుగులు చేసి.. నాలుగు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టు ఇంకా 537 రన్స్ చేయాల్సి ఉంది.
Bangladesh started their innings with 10 runs on the board with no batter hitting a ball.
– 5 runs through penalty, and 5 through No Ball + four form Rabada.pic.twitter.com/U3waKboV05
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2024