2024 icc women’s t20 world cup : టి20 మహిళా వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ సంచలనం.. 16 ఓటముల తర్వాత తొలిసారిగా..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా క్రికెట్ మైదానంలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. పురుషుల జట్టు ఇటీవల టీమిండియా పై రెండు టెస్టుల సిరీస్ ను O-2 ఓడిపోయిన నేపథ్యంలో.. మహిళల జట్టు సంచలన ప్రదర్శన చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 3, 2024 10:35 pm

2024 icc women’s t20 world cup

Follow us on

2024 icc women’s t20 world cup : స్కాట్లాండ్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అద్భుతమైన ప్రదర్శన సాగించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. అయితే బౌలర్లు మాత్రం మైదానంలో అద్భుతాలను సృష్టించారు. ఫలితంగా ప్రారంభ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో స్కాట్లాండ్ జట్టును మట్టి కరిపించింది. స్కాట్లాండ్ వికెట్ కీపర్ సరాహ్ బ్రైసీ (49*) చివరిదాకా పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో పొట్టి వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలి విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ లో వరుసగా బంగ్లాదేశ్ జట్టు 16 ఓటములను ఎదుర్కొంది. మహిళా టి20 క్రికెట్ వరల్డ్ కప్ 9వ సీజన్లో బంగ్లాదేశ్ జట్టు బోణి సాధించడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో లో స్కోరింగ్ మ్యాచ్ ఇది. నిగర్ సుల్తానా ఆధ్వర్యంలో బంగ్లా జట్టు అద్భుతమైన ఆట తీరుతో స్కాట్లాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్లో బౌలర్లు రీతు మొని 2/15, నిహిదా అక్తర్ 1/19 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 16 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టును స్కాట్లాండ్ బౌలర్లు సస్కియా 3/13, ఒలివియా 1/23 అద్భుతంగా బోధించడంతో తక్కువ పరుగులకే కట్టడి చేశారు. శోభన 36, శాతీ రాణి 29 మెరుపులు మెరిపించడంతో బంగ్లాదేశ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 109 రన్స్ చేసింది. అయితే ఈ స్వల్ప లక్ష్యాన్ని చేదించడానికి స్కాట్లాండ్ జట్టు ప్రారంభం నుంచి ఇబ్బంది పడింది. స్కాట్లాండ్ జట్టులో ఓపెనర్ సస్కియా (8)ను ఖాతూన్ ఔట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేథరిన్ (11), ఐసా(11) ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరోవైపు టికెట్లు పడుతున్నప్పటికీ ఓపెనర్ సరాహ్(49*) పట్టు వదలకుండా ఆడింది. బంగ్లా బౌలర్లు ఇబ్బంది పెడుతున్నప్పటికీ సహనాన్ని నమ్ముకుంది.. చివరిదాకా స్కాట్లాండ్ జట్టును గెలిపించడానికి తీవ్రంగా పోరాడింది. మరోవైపు బంగ్లా బౌలర్లు మరుఫా, మొని కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బంగ్లా జట్టును గెలిపించారు. ఈ గెలుపు ద్వారా బంగ్లా జట్టు క్రీడాకారిణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ జట్టు ట్రెండింగ్ లో నిలిచింది.. 16 ఓటముల తర్వాత .. 16 పరుగుల తేడాతో గెలవడంతో ఆ జట్టుపై అభినందనల జల్లు కురుస్తోంది. కల్లోల దేశంగా ఇబ్బంది పడుతున్న బంగ్లాదేశ్.. మ్యాచ్ నిర్వహించే అనుకూల పరిస్థితులు లేక యూఏఈ కి ఈ టోర్నీని ఐసిసి షిఫ్ట్ చేసింది. తొలి మ్యాచ్ ఆతిథ్య దేశం హోదాలో బంగ్లాదేశ్ ఆడింది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది.