Sperm Count : మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. డైలీ తినే ఆహార పదార్థాలు, అలవాట్లు, మద్యం, ధూమపానం వంటివి తీసుకోవడం వల్ల ఎక్కువగా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. సాధారణంగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు వ్యాధులను నయం చేయడానికి కొన్ని మందులు తీసుకుంటారు. ఈ మందుల ప్రభావం స్పెర్మ్ కౌంట్‌పై పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజుల్లో చాలామంది చిన్న సమస్యలకి కూడా మందులు వాడుతున్నారు. కాస్త తలనొప్పి వచ్చిన, జ్వరం వచ్చిన డాక్టర్ సలహా తీసుకోకుండా వేసుకుంటున్నారు. దీనివల్ల ఇంకా అనారోగ్యం దెబ్బతింటుంది. అయితే ఏ మందులు తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందో తెలుసుకుందాం.
ప్రోస్టేట్ మందులు
కొందరు మూత్ర విసర్జనకు సంబంధించిన ఔషధాలు వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రొస్టేట్ సమస్యకి వాడిన మందుల వల్ల , ఇది ఎక్కువగా స్పెర్మ్ బయటకు వస్తుంది. దీనివల్ల తొందరగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కాబట్టి ఏ మందులు వాడిన కాస్త జాగ్రత్తగా ఉండాలి.
యాంటీ డిప్రెషన్ మందులు
వ్యక్తిగత సమస్యలు, ఆందోళన వల్ల చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యి డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. డిప్రెషన్ తగ్గించుకోవాలని యాంటీ డిప్రెషన్ మందులను వాడుతుంటారు. ఈ మందులను వాడటం వల్ల డిప్రెషన్ తగ్గుతుందో లేదో తెలియదు. కానీ స్పెర్మ్ కౌంట్ మాత్రం తగ్గుతుంది. ఈ మందులు తీసుకోవడం వల్ల తండ్రి అయ్యే అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మందుల వాడవద్దు.
కీమోథెరపీ
క్యాన్సర్ నుంచి విముక్తి పొందాలంటే తప్పకుండా కీమోథెరపీ అవసరం. అయితే కీమోథెరపీ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. అయితే కొంతమందిలో కీమోథెరపీ తర్వాత స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. కానీ మరికొందరిలో పూర్తిగా ఆగిపోతుంది.
మత్తు పదార్థాలు
నల్లమందు వంటివి వాడటం వల్ల వీర్యకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ మందులను ఎక్కువగా ఉపయోగిస్తే టెస్టోస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెస్టోస్టెరాన్ తక్కువగా ఉత్పత్తి అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.
ఇతర మందులు
ఇవే మందులు కాకుండా కొన్ని రకాల వ్యాధులకు వాడిన మందులు కూడా స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. మూర్ఛ, హెచ్‌ఐవి వంటి వాటికి వాడిన మందులు, అలాగే బ్యాక్టీరియా, ఇన్‌ఫెక్షన్‌లు, యాంటీ బయాటిక్, రక్తపోటుకి వాడిన మందులు, ఆర్థరైటిస్‌కు వాడిన మందులు కూడా స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. పురుషులకు స్మెర్మ్ అనేది చాలా ముఖ్యం. ఇది ఉత్పత్తి కాకపోయిన, నాణ్యత లేకపోయిన కూడా పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. కాబట్టి ఏ మందులు వాడిన తెలుసుకోకుండా వాడవద్దు. స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకోవడానికి పోషకాలు ఉండే పదార్థాలను తీసుకోవాలి. అప్పుడే సమస్య నుంచి బయటపడతారు. లేకపోతే సంతానలేమి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.