Shakib ul Hassan : మరీ ఇంత పగ ఏంట్రా బాబూ.. పాక్ బ్యాటర్ ముఖం మీదకి బంతి విసిరిన బంగ్లాదేశ్ బౌలర్.. ఐసీసీ ఏం చర్యలు తీసుకుందంటే?

పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా.. తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో దారుణమైన ఓటమిని ఎదుర్కోవడంతో..పాక్ జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 27, 2024 10:18 pm

Shakib ul Hasan

Follow us on

Shakib ul Hassan:  తొలి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా.. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఐసీసీ నుంచి క్రమశిక్షణ చర్యలకు గురయ్యాడు.. మైదానంలో అతడు దురుసుగా ప్రవర్తించడంతో ఐసీసీ ఈ చర్యలు తీసుకుంది. తొలి టెస్ట్ లో భాగంగా పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో.. ఆ జట్టు బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి ముఖాన్ని లక్ష్యంగా చేసుకొని షకీబ్ బంతి విసిరేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆ పని చేశాడని ఇప్పుడు తెలిసింది. వాస్తవానికి మ్యాచ్లో భాగంగా ఆ బంతి ని విసిరేశాడని చాలామంది అనుకున్నారు. అయితే అతడు ఆ బంతి విసిరేసిన సమయంలో రిజ్వాన్ తెలివిగా తప్పుకున్నాడు. లేకుంటే అతడి ముఖానికి గాయమయ్యేది. ఉద్దేశపూర్వకంగా షకీబ్ బంతిని విసిరేసాడని గుర్తించిన ఐసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. షకీబ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనను అధిగమించినందుకు డీ మెరిట్ పాయింట్ జారీ చేసింది.

పాకిస్తాన్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. షకీబ్ బంతి వేయడానికి సమాయత్తమయ్యాడు. ఈ సమయంలో రిజ్వాన్ చివరి నిమిషంలో స్ట్రైక్ నుంచి వెనక్కి వెళ్ళాడు. దీంతో షకీబ్ కు కోపం పెరిగిపోయింది. వెంటనే ఆ బంతిని రిజ్వాన్ వైపు వేగంగా విసిరాడు. అయితే దీనిని గమనించిన ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కేటిల్ బొరో షకీబ్ కు చివాట్లు పెట్టాడు. దీంతో ఆ విషయం అక్కడితో ఆగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లపై బంతి లేదా ఇతర వస్తువులను వారి సమీపంలోకి విసరడం లెవెల్ -1 ఉల్లంఘన కింద భావిస్తారు.. ఈ నేపథ్యంలో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.9 ప్రకారం షకీబ్ పెనాల్టీకి గురయ్యాడు.

మరోవైపు ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు వేయకపోవడంతో పాక్ – బంగ్లాదేశ్ జట్లు ఐసీసీ నుంచి క్రమశిక్షణ ఆచార్యులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కోటా ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఆరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లు పాకిస్తాన్ కోల్పోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ మూడు పాయింట్లు వదులుకోవాల్సి వచ్చింది. ఈ కోత వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పట్టికలో ఇతర జట్ల స్థానాలపై తీవ్రంగా ప్రభావం చూపించింది. మూడు పాయింట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ ఏడవ స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్ ఎనిమిదవ స్థానానికి దిగజారింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు లాస్ అయ్యి 448 పరుగులు చేసి.. పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 565 రన్స్ చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 146 పరుగులకు కుప్పకూలింది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ చేదించింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్ ల సిరీస్ లో 1-0తో బంగ్లాదేశ్ లీడ్ లో కొనసాగుతోంది.