Gabbar Singh Re Release : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మేనియా పట్టుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులు సెప్టెంబర్ 2 వ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అందులో భాగంగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సెప్టెంబర్ 2న విడుదల చెయ్యబోతున్నారు. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న రాత్రి నుండి మొదలయ్యాయి. మొదట విజయవాడలో పలు షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, అవి హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి.
వారం రోజుల ముందు ఒక సినిమాకి ఈ స్థాయి బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి. ఇక మధ్యాహ్నం నుండి హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఈ బుకింగ్స్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోవడాన్ని చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. కొన్ని థియేటర్స్ లో నిమిషానికి నాలుగు వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు. అంతే కాదు ‘సరిపోదా శనివారం’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి నాలుగు రోజులైంది. ఈ నాలుగు రోజులకు కలిపి బుక్ మై షో యాప్ లో ఆ సినిమాకి 80 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కానీ గబ్బర్ సింగ్ చిత్రానికి కేవలం నాలుగు గంటల్లోనే 20 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయని, ఊపు చూస్తుంటే విడుదల సమయానికి 5 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. కేవలం సెప్టెంబర్ 2 వ తారీఖున మాత్రమే కాకుండా, పలు సెంటర్స్ లో సెప్టెంబర్ 1 వ తేదీన కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇది ఇలా ఉండగా ఓవర్సీస్ లో ఈ చిత్రం రీ రిలీజ్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ ని వారం రోజుల ముందే అధిగమించేసింది. అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఓవర్సీస్ మొత్తం మీద 30 వేల డాలర్ల గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయట.
ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకి సెప్టెంబర్ 2 వచ్చే లోపు లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. భవిష్యత్తులో ఈ రికార్డు ని కొట్టడం అంత తేలికైన విషయం కాదని ట్రేడ్ పండితులు అంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మాత్రమే కాదు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయట. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతుంది అనేది.