Shakib Al Hasan: వీరేంద్ర సెహ్వాగ్.. ఒకప్పటి టీమిండియా డాషింగ్ ఓపెనర్.. టెస్ట్ క్రికెట్లో త్రిబుల్ సెంచరీ చేసిన ఆటగాడు. షోయబ్ అక్తర్, షేన్ బాండ్, షేన్ వార్న్, బ్రెట్ లీ, మెక్ గ్రాత్, మిచెల్ జాన్సన్ వంటి బౌలర్లకు చుక్కలు చూపించిన వాడు.. అలాంటి విధ్వంసకరమైన ఆటగాడి గురించి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి తరం కూడా వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మనదేశమే కాకుండా ఇతర దేశాల్లోనూ వీరేంద్ర సెహ్వాగ్ కు విపరీతమైన అనుమానాలు ఉంటారు.. అయితే అలాంటి ఆటగాడి గురించి తనకు తెలియదని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ చెప్పాడు.. మీడియా సమావేశంలో అతడు ఈ విషయం చెప్పడం చర్చకు దారి తీస్తోంది.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ జట్టు పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ విజయంలో షకీబ్ ముఖ్యపాత్ర పోషించాడు. 46 బంతుల్లో ఏకంగా 64 పరుగులు చేశాడు. అప్పుడు అర్థ శతకం చేయడంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 159 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో నెదర్లాండ్స్ తడబడింది. 8 వికెట్ల కోల్పోయి 134 రన్స్ మాత్రమే చేసింది. ఇదే దశలో దక్షిణాఫ్రికా జట్టు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో షకీబ్ దారుణంగా విఫలమయ్యాడు. నోకియా బౌలింగ్లో పుల్ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొని, మూడు పరుగులు మాత్రమే చేశాడు.
షకిబ్ ఆ మ్యాచ్లో విఫలం కావడంతో.. భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.” మెరుగ్గా బ్యాటింగ్ చేసే షకీబ్ ఇంకా కాసేపు క్రీజ్ లో ఉంటే బాగుండేది.. హెడెన్, గిల్ క్రిస్ట్ లాగా షార్ట్ బంతులను పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించడం సరికాదు.. ఇలాంటి బంతులను స్ట్రోక్స్ ప్లే తో ఆడితేనే బాగుంటుంది. ఇలాంటి అప్పుడు ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలి.. షకీబ్ లాంటి ఆటగాడు.. ఇలాంటి ప్రదర్శన చేయడం దురదృష్టకరమని” సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
అయితే ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో షకీబ్ ముందు ప్రస్తావిస్తే..”అతను ఎవరు? వచ్చే విమర్శలకు ప్రతి ఆటగాడు సమాధానం ఎందుకు చెబుతాడు? జట్టుకు ఆడటం మాత్రమే ఆటగాడి బాధ్యత. మైదానంలో దిగిన తర్వాత బ్యాటర్ పరుగులు చేయాలి. బౌలర్ వికెట్లు పడగొట్టాలి. ఇదంతా కూడా ఆటగాళ్ల ప్రదర్శన, అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఫీల్డర్ కచ్చితంగా పరుగులను నియంత్రించాలి. కీలక సమయంలో క్యాచ్ లు అందుకోవాలి. జట్టుకు ఆటగాళ్లు అవసరమైన మేరకు సేవలు అందించినప్పుడే ఇలాంటివి వస్తుంటాయి. విమర్శలు వచ్చినంత మాత్రాన అది చెడ్డ విషయం కాదని” షకిబ్ పేర్కొన్నాడు.