Bangalore : ఈ వైఫల్య కథకు ఫుల్ స్టాప్ పెట్టాలని బెంగళూరు యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా ఇటీవల జరిగిన మెగా వేలంలో జట్టు ప్రక్షాళనకు నడుం బిగించింది. పనికిరాని ఆటగాళ్లను పక్కన పెట్టింది. ఏకంగా కొన్ని సీజన్ల పాటు కెప్టెన్ గా కొనసాగుతున్న డూ ప్లేసిస్ కు ఉద్వాసన పలికింది. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఆ విధానాన్ని పాటించలేదు. ఇటీవల జరిగిన మెగా వేలంలో యాజమాన్యాలు తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ విషయంలో బెంగళూరు మాత్రం పూర్తిగా విఫలమైంది. ఇదే అభిప్రాయాన్ని జియో స్టార్ నిపుణులు వ్యక్తం చేశారు. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసిన జట్ల జాబితాలో బెంగళూరును వరస్ట్ కేటగిరి జాబితాలో చేర్చారు.. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ 10 కి 8.8 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సన్ రైజెస్ హైదరాబాద్ 8.2, కింగ్స్ 11 పంజాబ్ 8, ముంబై ఇండియన్స్ 8, చెన్నై సూపర్ కింగ్స్ 7.9, గుజరాత్ టైటాన్స్ 7.9, లక్నో 7.8, కోల్ కతా నైట్ రైడర్స్ 7.7, రాజస్థాన్ రాయల్స్ 7.7, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7.4 పాయింట్లు సాధించినట్టు జియో స్టార్ నిపుణులు పేర్కొన్నారు.
గొప్ప ఆటగాళ్లను కొనుగోలు చేయలేదా?
2025 ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు మొత్తం 22 ఆటగాళ్లతో పోటీకి సిద్ధమైంది. మెగా వేలాని కంటే ముందు రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, యశ్ దయాల్ ను అంటిపెట్టుకుంది.. ఇందులో ఎంగిడి, దేవదత్ పడిక్కల్, మోహిత్, ఎంగిడి, లివింగ్ స్టోన్, హాజిల్ వుడ్, సాల్ట్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, తుషార, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రసిక్ ధార్, సుయాష్ శర్మ వంటి వారిని కొనుగోలు చేసింది. అయితే బెంగళూరు జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా ఆశించినంత స్థాయిలో ఆసక్తికరంగా లేదని, మిగతా జట్లతో పోల్చితే ఇది దారుణంగా ఉందని జియో స్టార్ నిపుణులు పేర్కొన్నారు. ” బెంగళూరు జట్టు యాజమాన్యం ఆటగాళ్ల కొనుగోలు చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోంది. కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో శ్రద్ధ చూపించినప్పటికీ… నేర్పరితనాన్ని మాత్రం ప్రదర్శించలేదు. అందువల్ల ఆ జట్టు గొప్ప బలాన్ని సంతరించుకోలేదు. మిగతా జట్టు ఆటగాళ్లతో పోల్చితే బెంగళూరు బలం తేలిపోయినట్టు కనిపిస్తోంది. కొంతకాలంగా బెంగళూరు జట్టు ఆట తీరు మెరుగుపడినప్పటికీ కప్ సాధించే స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి తన రూపురేఖలు మార్చుకుంటామని జట్టు యాజమాన్యం ప్రకటించింది.. అయితే అది ప్రకటనలకే పరిమితమైనటు కనిపిస్తోంది. ఇకపై ఆ జట్టు ఆటగాళ్ల ఆట తీరును మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. వారితో నిరంతర సాధన చేయించాల్సి ఉంటుందని” జియో స్టార్ నిపుణులు పేర్కొంటున్నారు.