Akkineni Nagarjuna : అక్కినేని కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, నాగార్జున తర్వాత ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ని తెచ్చుకున్న హీరోలలో ఒకటి అక్కినేని సుమంత్. ఒకప్పుడు ఈయనకి వరుస సూపర్ హిట్స్ రావడం స్టార్ ఇమేజి కి అతి చేరువగా వచ్చాడు. కానీ ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో బాగా డౌన్ అయ్యాడు. కానీ సుమంత్ అంటే ఆడియన్స్ లో ఇప్పటికే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. సుమంత్ సినిమా అంటే కచ్చితంగా ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన వేరే హీరో సినిమాలో కీలక పాత్ర పోషించినా కూడా, ఆ సినిమాలకు బలం చేకూరుతుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఏర్పడింది. అందుకు ఉదాహరణలు ‘సీతారామం’,’సార్’ వంటి చిత్రాలు. ఈ రెండు సినిమాల్లో సుమంత్ ప్రత్యేక పాత్రలు చేసాడు. ఆ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్స్ అయ్యాయి.
అదే విధంగా హీరో గా చేసే సినిమాలను కూడా ఆయన ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. తనకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ చెడిపోకుండా, విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాగార్జున గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ‘ప్రేమ కథ’. రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమాకి అప్పట్లో మంచి రివ్యూస్ వచ్చాయి కానీ, క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ చనిపోవడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. ఈ చిత్రం తర్వాత నేను భూమిక తో కలిసి ‘యువకుడు’ అనే చిత్రం చేశాను. ఈ సినిమాకి నాగార్జున గారు నిర్మాత. కమర్షియల్ గా అప్పట్లో మంచి సక్సెస్ అయ్యింది. కానీ ఈ సినిమాకి నాగార్జున గారు నాకు ఇస్తానన్నా రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదు. కట్టింగ్ల మీద కట్టింగులు చేసి చివరికి నా చేతిలో 5 లక్షలు పెట్టాడు’ అంటూ చెప్పుకొచ్చాడు సుమంత్.
‘యువకుడు’ ,’సత్యం’,’గౌరీ’, ‘గోదావరి’, ‘గోల్కొండ హై స్కూల్’, ‘మళ్ళీ రావా’ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన సుమంత్, ఈమధ్య కాలం లో స్పెషల్ రోల్స్ కూడా చేస్తూ మంచి పేరుని తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు మాస్, యూత్ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలతో స్టార్ స్టేటస్ కి ఈయన చాలా దగ్గరగా వచ్చాడు. కానీ ‘గోదావరి’ చిత్రం తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లోపించింది. ఫలితంగా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి, మార్కెట్ పోయింది. ప్రస్తుతం ఈయన ‘అనగనగ ఒక రౌడీ’, ‘వారాహి’ వంటి చిత్రాల్లో హీరో గా నటిస్తున్నాడు. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సెలెక్టివ్ గా అడుగులు వేస్తున్న సుమంత్ కెరీర్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.