Rohit And Virat Kohli: ఇండియన్ క్రికెట్ లో కీలక పాత్ర వహిస్తూ ఇండియన్ టీమ్ ని విజయతీరాలకు చేర్చడంలో కృషి చేస్తూ వస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ప్రస్తుతం టెస్టు, వన్డే సిరీస్ లకు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఎందుకంటే టి 20 ఫార్మాట్ కి యంగ్ ప్లేయర్స్ అందుబాటు లోకి రావడం వల్ల 20 మ్యాచ్ లు ఆడడానికి వీళ్లు పెద్ద ఇంట్రెస్ట్ చూపించనట్టుగా తెలుస్తుంది.ఇక ఈ క్రమంలోనే 2024 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సమయాన ఇండియన్ టీమ్ కి ఎక్కువగా వన్డే మ్యాచ్ లు ఆడే అవకాశాలు అయితే లేవు.
ఈ సంవత్సరం మొత్తంలో 3 వన్డే మ్యాచ్ లు మాత్రమే ఇండియన్ టీమ్ ఆడబోతుంది. గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా తమదైన రీతిలో ఎక్కువ వన్డే మ్యాచ్ లు ఆడి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే ఇండియన్ టీం కి వన్డే వరల్డ్ కప్ అందించాలనే ధృడ సంకల్పంతో ఉన్నప్పటికీ ఒక్క అడుగు దూరంలో వన్డే వరల్డ్ కప్ అనేది మిస్ అయింది. ఇక దాంతో అప్పటినుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా తీవ్రమైన నిరాశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇండియన్ టీమ్ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్నప్పటికీ వన్డే వరల్డ్ కప్ మిస్ అయింది అనే బాధ మాత్రం కోహ్లీ రోహిత్ శర్మ లని బాగా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సంవత్సరం టి 20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యం లో బీసీసీఐ ఇండియన్ టీం కి ఈ ఇయర్ లో ఎక్కువ టి20 మ్యాచ్ ఉండేలా ప్లాన్ చేసినట్టు గా తెలుస్తుంది. అందులో భాగంగానే 15 టెస్ట్ మ్యాచ్ లు ఆడితే 3 వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడుతుంది. ఇక 9 టి20 మ్యాచ్ లు అలాగే టి 20 వరల్డ్ కప్ కూడా ఆడుతుంది. ఇక టెస్టులకు, వన్డేలకు మాత్రమే పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇకమీదట జరిగే మ్యాచ్ ల్లో మనకు పెద్దగా కనిపించారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో కేవలం 3 వన్డే మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆడటానికి అవకాశం అయితే లేకుండా పోయింది.
ఇంకా ఇప్పటికే రోహిత్ శర్మకి 36 సంవత్సరాలు ఉండగా, విరాట్ కోహ్లీకి 35 సంవత్సరాలు ఉన్నాయి ఇక వీళ్లిద్దరూ కూడా ఇంకొక సంవత్సరంలో రిటైర్ మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం వాళ్లు మనకి టెస్ట్ సిరీస్ లో మాత్రమే కనిపిస్తారు. ఇది ఒక వంతుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి నిరాశని కలిగించే విషయమనే చెప్పాలి…