Bairstow : బెయిర్ స్టోను దురదృష్టం వెంటాడుతోందా..?

కేవలం ఒక్క పరుగు ద్వారంలో సెంచరీకి దూరం అయ్యాడు. పోనీ అవుట్ అయ్యాడా అంటే అది లేకుండా పోయింది. సహచర ఆటగాడు చివరి వికెట్ గా వెనుదిరగడంతో 99 పరుగుల వద్ద నాటౌట్ గా నిలవాల్సి వచ్చింది.

Written By: BS, Updated On : July 23, 2023 10:04 am
Follow us on

Bairstow :  ఇంగ్లాండ్ జట్టు స్టార్ క్రికెటర్ బెయిర్ స్టోను దురదృష్టం వెంటాడుతోంది. యాషెస్ సిరీస్ లో ఈ దరిద్రం మరింత ఎక్కువైనట్లు కనిపిస్తోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో అవుట్ ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలిసిందే. బౌలర్ వేసిన బంతి బెయిర్ స్టో ముఖం మీదుగా కీపర్ చేతిలోకి వెళ్లిపోయింది. అప్పటికే ఓవర్ ముగియడంతో అవతలి ఎండలో ఉన్న బెన్ స్టోక్స్ ను కలిసేందుకు క్రీజు వదిలి బయటకు వెళ్ళాడుబెయిర్ స్టో. అయితే అప్పటికి బంతిని ఇంకా చేతిలోనే ఉంచుకున్న ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ క్యారీ బెయిర్ స్టో క్రీజు వదిలి బయటకు వెళ్ళగానే వికెట్లను గిరాటేశాడు. బంతి కూడా నేరుగా వికెట్లను తాకడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పెద్ద ఎత్తున అప్పీల్ చేశారు. థర్డ్ అంపైర్ దీన్ని పరిశీలించి అవుట్ గా ప్రకటించాడు. బంతి ఇంకా డెడ్ కాలేదని.. అందుకే నిబంధనల ప్రకారం అవుట్ గా ప్రకటించినట్లు ఆ తర్వాత ఎంపైర్లు వెల్లడించారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున అప్పట్లోనే దుమారం రేగింది. అది ఇంకా మర్చిపోకముందే మరో దురదృష్టకమైన రీతిలో బెయిర్ స్టో అవుట్ కావడం గమనార్హం.
మరోసారి ఇలా వెంటాడిన దురదృష్టం..
లార్డ్స్ టెస్ట్ లో అనూహ్యంగా అవుట్ అయిన బెయిర్ స్టోను తాజాగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లోను మరోసారి దురదృష్టం వెంటాడింది. ఈ టెస్ట్ లో అవుట్ రూపంలో కాకపోయినా.. సెంచరీ రూపంలో వెంటాడడం గమనార్హం. చేసే అవకాశం ఉన్న ఆ అదృష్టానికి బెయిర్ స్టో నోచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు ద్వారంలో సెంచరీకి దూరం అయ్యాడు. పోనీ అవుట్ అయ్యాడా అంటే అది లేకుండా పోయింది. సహచర ఆటగాడు చివరి వికెట్ గా వెనుదిరగడంతో 99 పరుగుల వద్ద నాటౌట్ గా నిలవాల్సి వచ్చింది. దీనిని బట్టి చూస్తే బెయిర్ స్టోను ఏ స్థాయిలో అదృష్టం వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. గాయంతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన బెయిర్ స్టో రీ ఎంట్రీ దగ్గరనుంచి బ్యాడ్ లకు వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇకపోతే టెస్ట్ క్రికెట్లో 99 పరుగుల వద్ద నాట్ అవుట్ గా నిలిచిన ఏడో క్రికెటర్ గా జానీ బెయిర్ స్టో నిలిచాడు. ఇంతముందు జోఫ్రే బాయ్కాట్, స్టీవ్ వా, అలెక్స్ టూడర్,  షాన్ పొలాక్, ఆండ్రూ హాల్, మిస్బావుల్ హక్ ముందున్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో బెయిర్ స్టోను దురదృష్టం అదృష్టం పట్టినట్లు పట్టిందని పలువురు క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.