Champions Trophy 2025
Champions Trophy 2025: 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్.. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి పరువు తీసుకుంది. సొంత దేశంలో అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడమే ఆ జట్టును ఓటమి పాలయ్యేలా చేసింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 73 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో యంగ్ (113), లాథమ్(118*), ఫిలిప్స్ (61) కదం తొక్కడంతో న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 330 రన్స్ చేసింది. నసీం షా, రౌఫ్ చెరి 2 వికెట్లు పడగొట్టారు.
న్యూజిలాండ్ విధించిన 331 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి రంగంలో దిగిన పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ టార్గెట్ చేజ్ చేసేటట్టు కనిపించలేదు. 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఓటమిపాలైంది.. కుష్ దిల్షా (69), బాబర్ (64) రాణించారు. సల్మాన్ (42) కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ రూర్కి (3/47), సాంట్నర్(3/66) మూడేసి వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించారు. స్మిత్, బ్రేస్ వెల్ తలా ఒక వికెట్ సాధించారు. ఈ దారుణమైన ఓటమి పాకిస్తాన్ జట్టు సెమీస్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఇటీవల ట్రై సిరీస్లో పాకిస్తాన్ వరుసగా న్యూజిలాండ్ చేతిలో రెండు మ్యాచ్లో ఓడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనూ ఓటమిపాలై హ్యాట్రిక్ పరాజయాలను సొంతం చేసుకుంది.
పాకిస్తాన్ ఆటగాళ్లలో బాబర్ జజిడ్డు బ్యాటింగ్ చేయడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. న్యూజిలాండ్ స్పిన్ బౌలర్లతో బౌలింగ్ చేయించడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఒకానొక దశలో టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా బాబర్ అజాం టెస్టు తరహాలో బ్యాటింగ్ చేయడంతో పాకిస్తాన్ విజయావకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏ దశలోనూ బాబర్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించలేదు. 81 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేసిన అతడు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రిజ్వాన్, ఫకర్ జమాన్, సల్మాన్ అఘా దూకుడుగా ఆడబోయి వికెట్లు పడేసుకున్నారు. బాబర్ దూకుడుగా ఆడకపోయినప్పటికీ.. కనీసం బంతికి ఒక పరుగు తీసినా పాకిస్తాన్ చెట్టుకు ఇబ్బంది ఉండేది కాదు. దారుణమైన ఆటతీరుతో.. హాఫ్ సెంచరీ చేయాలని లక్ష్యంతోనే అతడు ఆడినట్టు కనిపించింది.. అతడి జిడ్డు ఆట వల్ల పాకిస్తాన్ కీలక మ్యాచ్ లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ ఆశలను గల్లంతు చేసుకుంది.