Akhanda 2 Vs Raja Saab
Akhanda 2 Vs Raja Saab: దేశవ్యాప్తంగా సీక్వెల్స్ కి ఉన్నటువంటి క్రేజ్ ప్రస్తుతం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘పుష్ప 2′(Pushpa 2), ‘స్త్రీ 2’ వంటి చిత్రాలు లేటెస్ట్ ఉదాహరణగా పరిగణించొచ్చు. ముఖ్యంగా మన టాలీవుడ్ ఆడియన్స్ కంటే, బాలీవుడ్ ఆడియన్స్ లో ఈ సీక్వెల్స్ క్రేజ్ తారాస్థాయిలో ఉంది. మన టాలీవుడ్ లో కూడా జనాలను అత్యంత ప్రభావితం చేసిన సినిమాలకు సీక్వెల్స్ చేస్తే కచ్చితంగా మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాలలో ఒకటి ‘అఖండ'(Akhanda Movie). నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం చిన్న పిల్లల దగ్గర నుండి, పండు ముసలివాళ్ళ వరకు, ప్రతీ ఒక్కరిని అలరించింది. డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా సంక్రాంతి సెలవులు పూర్తి అయ్యేవరకు థియేటర్స్ లో దిగ్విజయంగా ఆడిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. అలాంటి సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు.
గత 20 రోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 25 న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఇదే రోజున రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(The Raja Saab Movie) కూడా విడుదల కానుంది. మార్కెట్ పరంగా చూసిన, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూసిన, బాలయ్య ప్రభాస్ ముందు ఏ మాత్రం సరిపోడు అనేది నందమూరి అభిమానులు సైతం ఒప్పుకుంటారు. కానీ ‘రాజా సాబ్’ చిత్రానికి ‘అఖండ 2′(Akhanda2 Movie) కి ఉన్నంత క్రేజ్ లేదనే వాస్తవం కూడా ప్రభాస్ అభిమానులు ఒప్పుకోవాలి. అన్ని వర్గాల ప్రేక్షకులు తమ మొదటి ఛాయస్ గా ‘అఖండ 2’ ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఒకే రోజున విడుదలైతే కచ్చితంగా ‘రాజా సాబ్’ కి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఈ సంక్రాంతికి ఎలా అయితే పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంపై సీనియర్ హీరో వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ లీడ్ తీసుకుందో, అలా ‘రాజా సాబ్’ చిత్రంపై మరో సీనియర్ హీరో బాలయ్య లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే 2010 వ సంవత్సరం లో ప్రభాస్ ‘డార్లింగ్’, బాలయ్య బాబు ‘సింహా’ చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో విడుదలయ్యాయి. ‘డార్లింగ్’ కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది కానీ బాలయ్య ‘సింహా’ చిత్రం ఒక బాక్స్ ఆఫీస్ సునామీ ని సృష్టించింది అనే చెప్పాలి. ఈ సినిమా వసూళ్లు ‘డార్లింగ్’ కంటే పది కోట్ల రూపాయిలు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ‘రాజా సాబ్’, ‘అఖండ 2 ‘ చిత్రాలు పోటీ పడితే, ఫ్లాష్ బ్యాక్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.