Akhanda 2
Akhanda 2 : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక సీనియర్ హీరోల్లో బాలయ్య బాబు చేస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
నందమూరి నటసింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక రీసెంట్ గా వచ్చిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య (Balayya) సీనియర్ హీరోలందరిలో టాప్ పొజిషన్ లో నిలిచాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) డైరెక్షన్ లో అఖండ 2 (Akhanda 2) అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో కూడా తనకంటూ ఒక స్పెషలైజేషన్ ని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా మహాకుంభమేళలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించినట్లయితే బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే వస్తుంది. అలాగే బోయపాటి శ్రీను కూడా ప్రస్తుతానికి ఫ్లాప్ లో ఉన్నాడు. కాబట్టి ఆయనకి కూడా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందట…అయితే ఈ సినిమా కోసం బాలయ్య బాబు 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక బోయపాటి సైతం 20 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరికీ కలిపి 50 కోట్ల రెమ్యూనరేషన్స్ రూపం లోనే పోతే మిగతా 50 కోట్లతో ఈ సినిమాను చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక బాలయ్య బాబు సక్సెస్ ట్రాక్ ఎక్కి ముందుకు దూసుకెళ్తున్నాడు.
కాబట్టి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే బాలయ్య క్రేజ్ మరింత పెరుగుతుందనే చెప్పాలి. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ ఉంటే అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. కాబట్టి ఈ సినిమా కూడా వీళ్ళ కాంబోలో వచ్చిన గత సినిమాల మాదిరిగానే భారీ విజయాలను అందుకుంటాయనే కాన్ఫిడెంట్ ను సినిమా మేకర్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కీలకంగా మారబోతున్నాయట.
మొత్తానికైతే ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…మరి వాటికి ఏ మాత్రం తగ్గట్టుగానే బాలయ్య బాబు కూడా తీవ్రమైన కసరత్తులు చేస్తూ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలవాలని బోయపాటి శ్రీను సైతం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది…