Babar Azam Eating Biryani
Babar Azam : ఒక ఆటగాడికి శరీరం మీద నియంత్రణ ఉండాలి. తినే తిండి కూడా కంట్రోల్ లో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ఆటగాడు విజయవంతమవుతాడు. అతను ఆడే ఆటలో నూటికి నూరు శాతం ప్రతిభ చూపుతాడు. అలా కాకుండా ఇష్టానుసారంగా తిని.. ఇష్టానుసారంగా శరీరాన్ని పెంచి.. ఏ మాత్రం క్రమశిక్షణ లేకుండా ఉంటే ఆట మీద మనసును లగ్నం చేయలేడు. శరీరం మీద నియంత్రణను కలిగి ఉండడు. అప్పుడు మ్యాచ్లో ప్రతిభ చూపించలేడు. పైగా శరీరం కూడా ఆకృతి మారుతుంది. అప్పుడు సదరు ఆటగాడి పై విమర్శలు మొదలవుతాయి. టీమిండియాలో గతంలో ఆడిన పృథ్వి షా తిండిని కంట్రోల్ చేసుకోలేదు. ఫలితంగా శరీరం బరువు పెరిగింది. ఆ తర్వాత క్రమశిక్షణ లోపం కూడా ఎక్కువైంది. దీంతో పృథ్వి షా జట్టులో చోటును కోల్పోయాడు. చివరికి రంజీలో కూడా ఆడే అవకాశాన్ని అవకాశాన్ని కూడా దూరం చేసుకున్నాడు . ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. క్రికెట్ లోనే కాదు.. ఏ ఆటలోనైనా ఆటగాడికి ఫిట్నెస్ అనేది అత్యంత ముఖ్యం. అది సాధ్యమవ్వాలంటే ముందు ఆటగాడు నోటిని కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.
Also Read : హార్దిక్ కన్నుకొట్టాడు.. రోహిత్ చిరునవ్వు నవ్వాడు.. వైరల్ వీడియో
ఇష్టంగా తినేశాడు
ప్రస్తుతం పాకిస్థాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నీ జరుగుతోంది. ఇది కూడా మన ఐపిఎల్ లాంటిదే. గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెటర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. విదేశం, స్వదేశం అని తేడా లేకుండా విఫలం అవుతున్నారు. దీంతో ఆటగాళ్లు మొత్తం పాకిస్తాన్ సూపర్ లీగ్ ద్వారా ఫామ్ దొరకబుచ్చుకోవాలని భావిస్తున్నారు.. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్ల శరీర సామర్థ్యం మరోసారి చర్చకు దారి తీసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంమానికి ముందు బిర్యాని ఫీస్ట్ ఏర్పాటు చేశారు. అయితే అందులో పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లు బాబర్ అజాం, మహమ్మద్ హ్యారీస్ కంచాల నిండా బిర్యానీ తిన్నారు. అయితే బిర్యానీలో విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి ఆటగాళ్ల శరీర ఆకృతిని మార్చుతాయి. దీనివల్ల ఆటగాళ్లు ఆటపై దృష్టి సారించలేరు. అంతేకాదు బిర్యానీ ఆ తీరుగా తినడం వల్ల శరీరం లావు అవుతుంది. క్రికెటర్లకు అది ఏమాత్రం మంచిది కాదు. అందువల్లే ఆయిల్ ఫుడ్ కు చాలా మంది ఆటగాళ్లు దూరంగా ఉంటారు. బిర్యానీ లాంటి వంటకాలకు సైతం దూరంగానే ఉంటారు. అక్కడ దాకా ఎందుకు టీమిండియాలో దాదాపు సగం మంది ఆటగాళ్లు నాన్వెజ్ తినరు. కార్బోహైడ్రేట్ ఫుడ్ తక్కువగా తీసుకుంటారు. సాధ్యమైనంతవరకు ఇంపోర్టెడ్ వాటర్.. ప్రోటీన్స్, ఇతర ఖనిజ లవణాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఇక టీమ్ ఇండియాలో విరాట్ కోహ్లీ అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పుట్టగొడుగులు, నీరు, ప్రత్యేకమైన ఆకుకూరలు మాత్రమే తింటాడు. పొరపాటున కూడా బయటి ఆహారాన్ని తినడు. చివరికి చాక్లెట్లు, కేకుల వంటివి తినడు. అందువల్లే 36 సంవత్సరాల వయసులోనూ విరాట్ కోహ్లీ అత్యంత ఫిట్ గా ఉన్నాడు. అంతేకాదు ఏమాత్రం తన శరీర ఆకృతిలో అశ్రద్ధ వహించడు. అందుకోసమే ఫిట్నెస్ లో విరాట్ కోహ్లీని మించినవాడు లేడు అంటారు. కానీ ఇదే పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం తినడాన్ని ఇష్టపడుతున్నారు. బిర్యానీని కంచాలకు కంచాలు మెక్కడాన్ని ఇష్టపడుతున్నారు. అంతేతప్ప శరీరంపై దృష్టి సారించాలనే ఆలోచనను మాత్రం దూరం పెడుతున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్ల తీరు చూసి ఆ జట్టు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి తిండిబోతులు క్రికెట్ ఎలా ఆడతారంటూ మండిపడుతున్నారు.
Look at the state of these premium players. Tomorrow, Pakistan’s premier tournament begins, and their plates are loaded with carbohydrates.
There’s no seriousness from the PCB, the franchises, or the players. No wonder they’re so unfit. Unreal.
— M (@anngrypakiistan) April 10, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Babar azam babar azam indulges in biryani at a biryani feast ahead of the start of the pakistan super league
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com