RCB Records : నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఐపీఎల్లో శనివారం నాడు చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన ఉత్కంఠను పంచింది. చివరి వరకు టీవీకి అతుక్కు పోయేలా..ఫోన్ ను అంటి పెట్టుకునేలా చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. 5 వికెట్లు లాస్ అయ్యి 213 రన్స్ స్కోర్ చేసింది. ఆ తర్వాత 214 టార్గెట్ తో రంగంలోకి దిగిన చెన్నై చివరి వరకు పోరాడి.. 211 రన్స్ స్కోర్ వద్ద ఆగిపోయింది. మొత్తంగా రెండు పరుగుల తేడాతో బెంగళూరు పై ఓడిపోయింది. ఈ సీజన్లో సొంతవేదికలో బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓటమిపాలైంది. ఇప్పుడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ చివరి వరకు పోరాడి చెన్నై పరాజయం పాలైంది. చివరి ఓవర్ లో యష్ దయాల్ ధోని వికెట్ తీయడంతో పాటు.. చివరి బంతికి చెన్నై విజయానికి నాలుగు పరుగులు కావలసిన సమయంలో.. రెండు రన్స్ మాత్రమే ఇచ్చి.. బెంగళూరుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. దయాల్ బౌలింగ్లో శివం దుబే భారీ సిక్స్ కొట్టినప్పటికీ.. చివరి బంతిని దయాళ్ యార్కర్ వేయడంతో.. శివం దుబే ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా బెంగళూరు రెండు పరుగుల తేడాతో గెలిచింది.
Also Read : జూకర్ బర్గ్ కు విరాట్ కోహ్లీ అంటే లెక్క లేదా?
తక్కువ పరుగులతో గెలిచిన మ్యాచ్లు ఇవే
ఐపీఎల్ చరిత్రలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో బెంగళూరు ఐదు మ్యాచ్లు గెలిచింది.
2021లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు గెలిచింది.
2016లో పంజాబ్ జట్టుతో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది.
2019లో బెంగళూరు వేదికగా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు గెలిచింది.
2013లో బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 2 రన్స్ వ్యత్యాసంతో విక్టరీ సాధించింది.
2025లో బెంగళూరు వేదికగా చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 2 రన్స్ స్వల్ప వ్యత్యాసంతో గెలిచింది.
స్వల్ప తేడాతో..
ఇక స్వల్ప తేడా అంటే ఒకటి కంటే ఎక్కువ పరుగుల వ్యత్యాసంతో చెన్నై జట్టు ఏకంగా ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. 2019లో బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో చెన్నై ఓడిపోయింది. 2019లో హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 2025లో బెంగళూరు వేదికగా బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు పరుగుల తేడాలతో ఓడిపోయింది. 2023లో చెన్నై వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. 2018లో మొహాలీ వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది.