ఒలింపిక్స్ పండుగ ముగిసింది. పారా ఒలింపిక్స్ కు తెరలేచింది. వికలాంగులకు నిర్వహించే పారా ఒలింపిక్స్ పోటీల్లో భారత్ కు వరుసగా పతకాల పంట పండుతోంది. ఇటీవల రెండు రోజుల్లోనే టేబుల్ టెన్నిస్, హైజంప్ లో భారత్ కు రెండు రజతాలు అందించారు. ఇప్పుడు తాజాగా టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
మహిళల 1220 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్.హెచ్1) విభాగంలో భారత్ నుంచి ఇండియన్ షూటర్ అవనీ లేఖరా (Avani Lekhara) ఫైనల్ లో అద్భుత విజయాన్ని సాధించి భారత్ కు బంగారు పతకాన్ని సాధించి పెట్టింది.
ఈ ఫైనల్ లో అవనీ లేఖరా ఏకంగా 249.6 రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. చైనాకు చెందిన కుయ్ పింగ్ ఝాంగ్ 248.9తో రజత పతకాన్ని గెలుచుకోనున్నాడు. పారా ఒలింపిక్స్ లో మన వాళ్లు సాధిస్తున్న విజయవాలపై భారతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉక్రయిన్ కు చెందిన ఇరినా షెత్నిక్ 227.5తో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఇక పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయురాలిగా అవనీ లేఖరా రికార్డ్ సృష్టించింది. అవనీ లేఖర స్వర్ణ పతకం సాధించడంతో యావత్ దేశం గర్విస్తోంది. అవనీ లేఖరా విజయంపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఇండియా పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు దీపా మాలిక్ ఆనందం వ్యక్తం చేశారు. అవనీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
#Paralympics#Praise4Para@AvaniLekhara has become the FIRST WOMAN from India to win a Paralympics Gold
– Avani bagged the top position in Women's 10m Air Rifle Standing SH1 final@IndiaSports @Media_SAI @ianuragthakur pic.twitter.com/fw9TjNlOg8
— DD News (@DDNewslive) August 30, 2021