
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి బంగారు పతకం లభించింది. మహిళల ఘాటింగ్ 10 మీటర్ల విభాగంలో షూటర్ అవని లేఖరా స్వర్ణం పతకం సాధించింది. దీంతో షూటింగ్ లో భారత్ కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో 621.7 స్కోరు సాధించిన అవని.. ఫైనల్లో అడుగు పెట్టింది. టోక్యో పారాలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ కు స్వర్ణం, రెండు రజత పతకాలు వచ్చాయి.