
కడుపున పుట్టిన బిడ్డలను ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటాం.. మనుషులే కాదు.. జంతువులు, పశు పక్ష్యాదులు కూడా తమ పిల్లల పట్ల ప్రేమ చూపిస్తాయి. కానీ మానవ సమాజంలోని కొందరు క్రూరులు మాత్రం తమ కడుపున పుట్టినవారిని కూడా వదలకుండా అత్యంత దారుణంగా హింసిస్తున్నారు.
సమాజం ఎటువైపు పోతుందో అర్థం కావడం లేదు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వదిలేసి కన్న పిల్లలపై కసాయితనం చూపించింది ఓ దుర్మార్గపు తల్లి. పసిపిల్లలను చావబాదింది. పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తూ వీడియోలు తీసి ఏకంగా భర్తకు పంపి తన పైశాచిక ఆనందాన్ని పొందింది.
తమిళనాడుకు చెందిన ఓ తల్లి తన రెండేళ్ల కొడుకును చిత్రహింసలకు గురిచేసిన సంఘటన వెలుగుచూసింది. కొడుకును రకరకాలుగా కొట్టి హింసకు గురిచేసింది. దీంతో ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తమిళనాడులోని విల్లిపురం జిల్లాకు చెందిన సత్యమంగళం గ్రామానికి చెందిన వడివేలన్ తులసి దంపతులకు గోకుల్ అనే నాలుగు సంవత్సరాలు, ప్రదీప్ అనే రెండేళ్ల ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు భార్యభర్తలు తరచూ గొడవ పడేవారు.
భర్తపై కోపంతో పిల్లలను తులసి చావబాదుతోంది. కొట్టడమే కాకుండా కొడుతున్న వీడియోలను తీసి భర్తకు పంపి పైశాచిక ఆనందం పొందేది. ఇలా మొత్తం 250 సార్లు కొట్టింది ఈ దుర్మార్గపు తల్లి. దీంతో భార్య వేధింపులు భరించలేని భర్త వడివేలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు కావడంతో ఆమె ఏపీలోని చిత్తూరు జిల్లాకు పారిపోయినట్టు సమాచారం. కాగా ఆమెకు ప్రియుడు ఉన్నాడని.. అందుకే వారి ఇద్దరి మధ్య తరచూ ఈ గొడవ జరుగుతోందని.. అందుకే పిల్లలను కొడుతోందని భర్త ఆరోపిస్తున్నాడు.
https://www.youtube.com/watch?v=__Mbe_B01YY