Champions Trophy : ఆస్ట్రేలియా జట్టుకు ప్రస్తుతం పాట్ కమిన్స్(Pat Cummins) నాయకత్వం వహిస్తున్నాడు. అతడి ఆధ్వర్యంలోనే ఆస్ట్రేలియా జట్టు 2023 వన్డే వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని కమిన్స్ భావిస్తున్నాడు. అయితే అతడు ఈ టోర్నీకి దూరం అవుతాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆండ్రూ మెక్ డోనాల్డ్ పరోక్షంగా వివరించాడు.. ఒకవేళ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే హెడ్ లేదా స్మిత్ కెప్టెన్సీ రేస్ లో ఉంటారని మెక్ డోనాల్డ్ ప్రకటించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనలో ఉంది. కమిన్స్ భార్య త్వరలో రెండవ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నందున.. అతడు ప్రస్తుతం పితృత్వ సెలవుల్లో ఉన్నాడు. లంక సిరీస్ కు దూరంగా ఉన్నాడు.. లంకతో జరిగే టెస్ట్ సిరీస్ లో లేని ఆస్ట్రేలియా జట్టు సభ్యులు వన్డే టోర్నీ కోసం ఆస్ట్రేలియా నుంచి శ్రీలంక వెళ్లాల్సి ఉంటుంది.. మరోవైపు జోష్ హేజిల్ వుడ్ గాయం పై కూడా మెక్ డొనాల్డ్ కీలక అప్డేట్ ఇచ్చాడు.. హేజిల్ వుడ్ తన పూర్వపు ఫామ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే చాంపియన్ ట్రోఫీలో అతడు ఆడడం కష్టమేనని డోనాల్డ్ పరోక్షంగా ప్రకటించాడు.. గాయం కారణంగా కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. ఇప్పుడు జాబితాలో కమిన్స్, హేజిల్ వుడ్ కూడా ఉండడం విశేషం. ఒకవేళ వారు గనుక జట్టుకు పూర్తిస్థాయిలో దూరమైతే ఆస్ట్రేలియా కు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇబ్బందులు తప్పవు. మార్ష్ కు ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడిని ఇంతవరకు ఆస్ట్రేలియా జుట్టు ప్రకటించలేదు..బ్యూ వెబ్ స్టర్ మార్ష్ కు బదులుగా ఆస్ట్రేలియా జట్టులో ఈ యాడ్ అవుతాడని మెక్ డోనాల్డ్ పేర్కొన్నారు. ఇంకా కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారని తెలుస్తోంది.. స్టోయినిస్, హర్జి వంటి ఆల్రౌండర్లు కూడా గాయాల బారిన పడ్డారని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు రెండు టెస్టులు, రెండు వన్డే మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇందులో బాగా ముందుగా టెస్ట్ మ్యాచులు నిర్వహిస్తున్నారు. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు స్మిత్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆటగాడిగా సత్తా చాటడమే కాకుండా.. కెప్టెన్ గానూ స్మిత్ ఆకట్టుకుంటున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో స్మిత్ 141 పరుగులు చేశాడు. మరో ఆటగాడు ఉస్మాన్ ఖవాజా 232 పరుగులతో కదం తొక్కాడు. జోష్ ఇంగ్లిస్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఆస్ట్రేలియా – శ్రీలంక జట్ల మధ్య రెండవ టెస్ట్ గురువారం నుంచి మొదలవుతుంది. ఫిబ్రవరి 12, 14 తేదీలలో కొలంబో వేదికగా ఆస్ట్రేలియా- శ్రీలంక జట్లు వన్డే మ్యాచ్లలో తలపడతాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్తుంది. చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతుంది. ఛాంపియన్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతుంది.