Janasena : రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది జనసేన( janasena ). ఆ బాధ్యతను అధినేత పవన్ మెగా బ్రదర్ నాగబాబుకు అప్పగించారు. ఇప్పటికే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా రాయలసీమపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజకీయ సభలు పెట్టాల్సిన అవసరం లేకపోయినా.. అధికార పార్టీ ఇలా ప్రత్యేక సమావేశం నిర్వహించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది జనసేన. వైసిపి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సైతం చేర్చుకునేందుకు సిద్ధపడుతోంది. అందుకే నాగబాబు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి రాయలసీమలో వైసీపీ బలపడకూడదు అన్నది జనసేన స్కెచ్. అందులో భాగంగానే ఈ రాజకీయ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* జనసేన వైఖరి పై చర్చ
రాష్ట్రంలో( State wise) అధికారపక్షంగా ఉన్న జనసేన రాయలసీమలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం చర్చకు దారితీస్తోంది. వైసిపి ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఇప్పటివరకు ఆయన హవా నడుస్తూ వస్తోంది. పెద్దిరెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జెండా మాత్రమే పుంగనూరులో కనిపిస్తుంది. అటువంటి చోట జనసేన రాజకీయ సభను నిర్వహించడం చిన్న విషయం కాదు. తద్వారా రాయలసీమలో స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలన్నది జనసేన ప్లాన్ గా తెలుస్తోంది.
* వచ్చే ఎన్నికలే లక్ష్యం
పొత్తులో భాగంగా రాయలసీమలో( Rayalaseema) జనసేనకు రెండు సీట్లు దక్కాయి. ఆ రెండు చోట్ల జనసేన విజయం సాధించింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య పెరగాలంటే ఇప్పటినుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకే వైసీపీ నుంచి కీలకమైన నేతలను చేర్చుకునే పనిలో పడింది జనసేన. అనంతపురం జిల్లాకు చెందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇలాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందుకే రాయలసీమపై స్కెచ్ వేస్తే భారీగా నేతలు వైసిపి నుంచి జనసేన లో చేరే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే నాగబాబు రాయలసీమ పై ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది.
* పనిచేసిన కాపు ఫ్యాక్టర్
ఈ ఎన్నికల్లో కాపు( Kapu ) ఫ్యాక్టర్ పనిచేసింది. కాపులంతా జనసేన తో పాటు కూటమికి మద్దతు తెలిపారు. వారి మద్దతును పొందడంతో పాటు రాయలసీమలో బలిజ, రెడ్డి సామాజిక వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా జనసేన పౌలు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి బలం అంతగా లేదు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పోల్చుకుంటే రాయలసీమలో బలం తక్కువే. 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చినా.. రాయలసీమలో మాత్రం వైసిపి హవా నడుస్తూ వచ్చింది. 2019లో అయితే టిడిపి వెతికిన దొరకలేదు. ఈసారి టిడిపికి సంపూర్ణ విజయం వెనుక జనసేన ఉంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి రాయలసీమలో పొత్తులో భాగంగా వీలైనంత ఎక్కువ సీట్లు తీసుకోవాలని జనసేన భావిస్తోంది. అందుకే ఈ స్పెషల్ ఫోకస్ అని తెలుస్తోంది. అయితే జనసేన బలం పెరిగితే ఆ పార్టీ మరిన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది. టిడిపిలో కూడా అదే టెన్షన్ ఉంది. మరి రాయలసీమలో జనసేన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.