Kim Garth: ప్రపంచంలో ఉన్న అన్ని క్రీడల్లో అత్యధిక పాపులారిటీ ఉన్న క్రీడ క్రికెట్. క్రికెట్ ప్లేయర్స్.కి అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు. మ్యాచెస్ ,రన్స్ , సెంచరీస్, క్యాచెస్ ,వికెట్స్ ఇలా ఏదో ఒక అంశంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఫేమస్ అయిన క్రికెట్ ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. కానీ ఆస్ట్రేలియా కు చెందిన ఒక మహిళా క్రికెటర్ మాత్రం అరుదైన విషయంలో రికార్డు సృష్టించింది.
మామూలుగా ఫ్యామిలీ లో ఎవరైనా డాక్టర్ అయితే వాళ్ల పిల్లల్లో ఎవరో ఒకరు డాక్టర్ అవ్వడం.. టీచర్ ఫ్యామిలీలో టీచర్ ఉండడం కామన్. కానీ ఫ్యామిలీ మొత్తం క్రికెటర్స్ ఉండడం ఇంతవరకు మనం ఎక్కడ వినలేదు. అయితే ఆస్ట్రేలియా లేడీ క్రికెటర్ కిమ్ గార్త్ ఫ్యామిలీ మొత్తం క్రికెటర్స్. అంతేకాదు తల్లి ,తండ్రి మరియు సోదరుడు ప్రాతినిధ్యం వహించే దేశం జట్టుతో తలపడి కిమ్ అరుదైన రికార్డు నెలకొల్పింది.
అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీలో ఇలా కుటుంబం మొత్తం క్రికెట్ ప్లేయర్స్‌గా ఉండడం ఎంతో అరుదైన విషయం. క్రికెటర్‌గా రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించడం అనేది ప్రస్తుతం సాధారణమే అయినప్పటికీ.. తనతో పాటుగా కుటుంబం మొత్తం ప్రాతినిధ్యం వహించిన జట్టుతో పోటీ పడడం అనేది మాత్రం క్రికెట్ హిస్టరీలో ఇదే మొదటిసారి.
నిన్న మంగళవారం ఐర్లాండ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో కిమ్ గార్త్‌కు ఈ అరుదైన అవకాశం దక్కింది.కిమ్ గార్త్ 2010 మరియు 2019 మధ్యకాలంలో ఐర్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2022 నుంచి ఆమె ఆస్ట్రేలియా తరఫున ఆడుతోంది.
.
ఐర్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో కిమ్ గార్త్ ఈ అరుదైన రికార్డ్ దక్కించుకుంది. 2010 నుంచి 2019 వరకు కిమ్ గార్త్ ఐర్లాండ్ క్రికెట్ టీం కు ప్రాతినిధ్యం వహించగా.. 2022 నుంచి ఆస్ట్రేలియాకు ఆడుతోంది. కిమ్ తండ్రి జోనాథన్ గార్త్, తల్లి అన్నే మేరీ మెక్‌డోనాల్డ్ ఐర్లాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా ఆమె తమ్ముడు జోనాథన్ గార్త్ ప్రస్తుతం ఐర్లాండ్ క్రికెట్ జట్టులో మంచి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎంతో ఆసక్తికరంగా జరిగిన నిన్నటి రెండో వన్డే మ్యాచ్‌లో ఐర్లాండ్ పై ఆసీస్ జట్టు 153 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 7 వికెట్లు నష్టంతో 321 పరుగులు సాధించింది. ఆసీస్ జట్టు లో ఎల్లీస్ పెర్రీ(91), అష్లే గార్డ్‌నర్(65) పరుగులు సాధించి మెరుగైన ఆటను కనబరిచారు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఐర్లాండ్ జట్టు 38.2 ఓవర్లకు 168 పరుగులు చేసి కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో 6 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన కిమ్ రెండు మెయిడిన్ ఓవర్లు చేసి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.