https://oktelugu.com/

Peddireddy Ramachandra Reddy: మంత్రి పెద్దిరెడ్డి వెనుక అంత జరుగుతోందా

జగన్ కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తే..ఆ తదుపరి నాయకత్వం ఎవరు వహిస్తారు అన్న ప్రశ్న వైసీపీలో ఉంది. అయితే ఈ విషయంలో తానే ముందున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.

Written By: , Updated On : July 26, 2023 / 02:56 PM IST
Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy

Follow us on

Peddireddy Ramachandra Reddy: ఏపీ క్యాబినెట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. సీఎం జగన్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా పేరుంది. మంత్రివర్గ విస్తరణలో హేమాహేమీలను మార్చినా..పెద్దిరెడ్డిని మాత్రం మార్చే సాహసం చేయలేదు. వెనుక భయము, గౌరవం రెండు ఉన్నాయి. అయితే ఇటీవల పెద్దిరెడ్డి చర్యలు జగన్కు మింగుడు పడటం లేదని తెలుస్తోంది.

జగన్ కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తే..ఆ తదుపరి నాయకత్వం ఎవరు వహిస్తారు అన్న ప్రశ్న వైసీపీలో ఉంది. అయితే ఈ విషయంలో తానే ముందున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మాట బాధ్యతతో అన్నారా? భయపెట్టడానికి అన్నారా? అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. అయితే పెద్దిరెడ్డి విషయంలో మాత్రం ఒక విధమైన ప్రచారం జరుగుతోంది. జగన్ను కట్టడి చేసే నేతల్లో పెద్దిరెడ్డి ఒకరని టాక్ ఎప్పటి నుంచే ఉంది. అందుకే జగన్ పెద్దిరెడ్డి విషయంలో సీరియస్ గా దృష్టి పెట్టారని సమాచారం.

ఇటీవల రామచంద్ర యాదవ్ అనే యువకుడు ఒక పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వెనక ఎవరు ఉన్నారు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. విజయవాడలో సువిశాల ప్రాంగణంలో భారీ జన సందోహం నడుమ రామచంద్ర యాదవ్ పార్టీని ప్రారంభించారు. ఇందుకుగాను భారీగా ఖర్చు చేశారు. పారిశ్రామికవేత్త గా పేరొందిన రామచంద్ర యాదవ్ ది పుంగనూరు నియోజకవర్గమే. చాలాసార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయ ప్రత్యర్థి గా నిలవాలనుకున్నారు. ఈ క్రమంలో ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి. అటువంటి వ్యక్తి పార్టీ స్థాపించాలని కోవడం సాహసంతో కూడుకున్న పనే. అయితేదీని వెనుక పెద్దిరెడ్డి ప్రత్యర్థులు ఉన్నట్లు చిత్తూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. తొలుత చంద్రబాబు పేరు బయటికి వచ్చినా .. మొన్నటి పార్టీ ఆవిర్భావ సభానంతరం ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అంటే పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వ పెద్దలే పావులు కదుపుతున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.