Mitchell Starc : ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. 2012, 2014 సీజన్లలో విజేతగా ఆవిర్భవించిన కోల్ కతా నైట్ రైడర్స్.. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి విన్నర్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. కోల్ కతా జట్టు న్ మెంటార్ గౌతమ్ గంభీర్ ముందుండి నడిపించడంతో.. ఆ జట్టుకు ఐపీఎల్ 2024 సీజన్లో ఎదురే లేకుండా పోయింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ పై మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మను బోల్తా కొట్టించిన విధానం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
కోల్ కతా తరఫున ఆడిన స్టార్క్.. మొదట్లో ఆశించినంత స్థాయిలో ప్రతిభ చూపలేదు. దీంతో అతడిని ఎందుకు కొనుగోలు చేశారని కోల్ కతా జట్టు యాజమాన్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. “భారీ ధరకు కొనుగోలు చేశారు. ఐపీఎల్ వేలంలోనే అత్యధికంగా అతడికి చెల్లించారు. కానీ తీరా చూస్తే అతడేమో ఇలా విఫలమవుతున్నాడు. ఇందుకోసమేనా అతడిని ఏరి కోరి కొనుగోలు చేసిందంటూ” కోల్ కతా యాజమాన్యంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. అయితే జూలు విధిల్చిన సింహం లాగా స్టార్క్ తర్వాతి మ్యాచ్ లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కోల్ కతా కు తిరుగులేని విజయాలు అందించాడు. తనను భారీ ధర పెట్టి కొనుగోలు చేయడం సబబే అని నిరూపించాడు. ముఖ్యంగా చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై అద్భుతమైన గణాంకాలను స్టార్క్ నమోదు చేశాడు. కీలక ఓవర్లను అత్యంత పొదుపుగా వేసి కోల్ కతా జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. అదే కాదు ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్నాడు
వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఆటగాళ్ల వేలంలో స్టార్క్ ను కోల్ కతా యాజమాన్యం 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకున్న తర్వాత..కోల్ కతా జట్టు దక్కించుకున్న ప్రైజ్ మనీ చూసి స్టార్క్ ఆశ్చర్య పోయాడట. ముందుగా ఐపీఎల్ నిర్వాహక కమిటీ చెప్పినంత స్థాయిలో కోల్ కతా ప్రైజ్ మనీ పొందులేకపోయిందట. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు.. సాక్షాత్తూ మిచెల్ స్టార్కే. ఇటీవల అతడు ఒక టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రస్తావించాడు..”నాకు గత ఏడాది వేలంలో 24.75 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. నాకే అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేశారని అక్కడ మీడియాలో వార్తలు చూసిన తర్వాత అర్థమైంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో చెక్కుల పంపిణీ అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైంది. అక్కడి వాతావరణం చూసిన తర్వాత నాలో ఉత్సాహం తగ్గిపోయింది. ఆ తర్వాత విజేత జట్టుగా నిలిచిన కోల్ కతా కు చెక్కు అందించారు. నాకు వేలంలో చెల్లించిన దానికంటే కోల్ కతా కు తక్కువ దక్కింది..కోల్ కతా జట్టుకు ఇచ్చిన చెక్కు చూస్తే INR 20 CR అని ఉంది. దాన్ని చూసిన నా సహచర ఆటగాడు రఘువంశీ ఓహ్.. మీరు ఆశ్చర్యపోయారా.. అది మీకు చెల్లించిన దాని కంటే తక్కువే అంటూ కామెంట్ చేశాడని” స్టార్క్ పేర్కొన్నాడు..ఇక చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా – హైదరాబాద్ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 113 పరుగులకే ఆల్ అవుట్ అయింది. స్టార్క్ చెలరేగడంతో హైదరాబాద్ జట్టు వణికిపోయింది. అభిషేక్ శర్మ, హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు తేలిపోవడంతో హైదరాబాద్ జట్టు తక్కువ స్కోర్ చేసి ఓడిపోయింది.
️Mitchell Starc : “The IPL Final presentation didn’t start until the midnight & basically killed the Vibe.
Then cheques for winning team came over, it had INR 20CR price. Angkrish looked at that and said – Huh its not even what you got paid . pic.twitter.com/FhDpWb7qOD— KKR Vibe (@KnightsVibe) July 12, 2024