Revanth Reddy : తెలంగాణ పోలీసుల విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదే

ఇక తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే పైరవీలకు తావు లేదని ప్రకటించారు. బదిలీలు, ప్రమోషన్ల కోసం పైరవీలతో వస్తే పక్కకు పెడతామని ప్రకటించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Written By: Raj Shekar, Updated On : July 13, 2024 10:22 am
Follow us on

Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత పాలనకు భిన్నంగా పాలన సాగిస్తున్నారు. ప్రజా పాలన పేరుతో ప్రజల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలను కూడా రేవంత్‌రెడ్డితోపాటు ఆయన మంత్రి వర్గ సహచరులు కలిపి తీసుకుంటున్నారు. తద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ఇందులో భాగంగానే అనేక పతకాలు అమలు చేస్తున్నారు. ఆరు గ్యాంరటీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా రుణమాఫీ, రైతు భరోసాపై కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ..
ఇక తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే పైరవీలకు తావు లేదని ప్రకటించారు. బదిలీలు, ప్రమోషన్ల కోసం పైరవీలతో వస్తే పక్కకు పెడతామని ప్రకటించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గంజాయి, డ్రగ్స్‌తోపాటు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించొద్దని సూచించారు. ఈ క్రమంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు.

చంద్రబాబు, వైఎస్సార్‌ హయాంలో..
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డి పనిచేసన సమయంలో నేరాల నియంత్రణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారి హయాంలో ఎన్‌కౌంటర్లు కూడా జరిగాయి. చంద్రబాబు హయాంలో నక్సలైట్లను కాల్చి చంపేశారు. ఇక వైఎస్సార్‌ హయాంలో మావోయిస్టుతోపాటు అమ్మాయిల జోలికి వచ్చే వారిని కూడా ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఐదేళ్లు కేసీఆర్‌ కూడా పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఈ క్రమంలోనే నయీం ఎన్‌కౌంటర్, దిశ నిందితుల ఎన్‌కౌంటర్లు జరిగాయి. రెండో సారి అధికారంలోకి వచ్చాక పోలీసులు పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. నేరం దీంతో నేరం చేసిన వారికి భయం లేకుండా పోయింది. నేరం చేయడం మంచి లాయర్‌ను పెట్టుకుని స్వేచ్ఛగా బయట తిరగడం పరిపాటిగా మారింది.

మళ్లీ నేరం చేయాలంటే భయపడేలా..
నేరాల నియంత్రణకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆరు నెలల్లో ఐదు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ప్రధానంగా డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాల వినియోగం రవాణా నియంత్రణతోపాటు దొంగల ముఠాలు, యువతులను వేధించేవారి భరతం పట్టేలా పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు నేరస్తుల భరతం పడుతున్నారు.

యాంటీ డెకాయిట్‌ టీంలు..
హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇటీవల దొంగతనాలు పెరిగాయి. పార్థీ, చెడ్డీ, నిక్కర్, చున్నీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. ప్రజల ఆస్తులను అపహరిస్తున్నాయి. చైన్‌ స్నాచింగ్‌లు అయితే విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు యాంటీ డెకాయిట్‌ టీంలు ఏర్పాటు చేశారు. నేరాత నియంత్రణకు వీరికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో ఈ టీంలు నేరాల నియంత్రణకు వరుసగా దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అనేక ముఠాలను పట్టుకున్నాయి. ఎదురు తిరిగితే ఎన్‌కౌంటర్‌ చేసే స్వేచ్ఛ కూడా ఉండడంతో ఆరు నెలలుగా పోలీసులు తుపాకులకు కూడా పని చెబుతున్నారు. తద్వారా నేరం చేస్తే ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఉంటుందో హెచ్చరిక ఇస్తున్నారు. దీంతో నేరం చేయాలనుకునే వారిలో భయం పుట్టిస్తున్నారు.