Australia Vs South Africa Semi Final: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా టీం ల మధ్యన రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఏ టీం విజయం సాధిస్తుంది. అనే దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే ఇండియన్ టీమ్ మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టీమ్ ని భారీగా చిత్తు చేసి ఫైనల్ కి చేరుకుంది. ఇక ఇలాంటి క్రమంలో ఇండియా తో పాటు ఫైనల్ లో పోటీపడే టీం ఏది అనే దాని మీదనే ఇప్పుడు చర్చ ఎక్కువగా సాగుతుంది. కాబట్టి ఈ చర్చలకు తెరపడాలి అంటే ఈరోజు జరిగే మ్యాచ్ తో ఈ రెండు టీం ల్లో ఇండియాతో పాటు ఫైనల్ లో తలపడే టీమ్ ఏది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది.
ఇక ఆ టీమ్ ని ఎలా ఎదుర్కోవాలి అనే దానిమీద ఇండియా తన వ్యూహాలు రచించుకోవాల్సి ఉంటుంది.
ఇక ఇవాళ్ల జరగబోయే మ్యాచ్ లో రెండు టీ లా పరిస్థితి ఎలా ఉంది. అనేది ఒకసారి మనం తెలుసుకుందాం… ఈ టోర్నీ లీగ్ దశలో రెండు టీంలు కూడా తొమ్మిది మ్యాచులు ఆడితే చేరో ఏడు విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ రెండు టీంలు తలపడినప్పుడు సౌతాఫ్రికా 311 పరుగులు చేసి ఆస్ట్రేలియాని మాత్రం 177 పరుగులకు ఆల్ ఔట్ చేసి చిత్తు గా ఓడించి సౌతాఫ్రికా టీం ఘన విజయం సాధించింది.
ఇక ఇలాంటి క్రమం లో సౌతాఫ్రికా నెదర్లాండ్స్ లాంటి ఒక చిన్న జట్టు మీద పరాభవాన్ని పొంది ఆ టీం యొక్క ఇంటిగ్రిటీని పోగొట్టుకుంది. ఇక సౌతాఫ్రికా లీగ్ దశలో చేసిన తప్ప ఏదైనా ఉంది అంటే అది నెదర్లాండ్స్ టీం పైన ఓడిపోవడమే, ఇక ఇప్పటికే నెదర్లాండ్స్ , ఇండియన్ టీం మీద మాత్రం పరాజయాన్ని చవి చూసింది… సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది.అందుకే వాళ్ళ టీమ్ అత్యధిక పరుగులు చేయగలుగుతుంది. ఇంకా ఇప్పటికే వాళ్ల ఓపెనర్ అయిన డికాక్ ఈ టోర్నీ లో నాలుగు సెంచరీలు చేసి చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. వండర్ డాసెన్ కూడా వరుస సెంచరీలు చేస్తున్నాడు.ఇక బౌలింగ్ లో కూడా మాక్రో జాన్సన్,మహారాజా లాంటి బౌలర్లు అద్భుతాలను క్రియేట్ చేస్తున్నారు… ఒక రకంగా చెప్పాలంటే సౌతాఫ్రికా టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది…
ఇక ఆస్ట్రేలియా టీమ్ విషయానికొస్తే ఈ టోర్నీ లో లీగ్ దశ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత వరుసగా ఏడు మ్యాచ్ ల్లో గెలిచి ఆస్ట్రేలియా తమ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంది. ఒక దశలో వీళ్లు సెమీఫైనల్ లోకి రాలేరేమో అనుకున్న కూడా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకొని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతు సమిష్టి పోరాటం చేస్తూ వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ లీగ్ లో చివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఆడిన ఆస్ట్రేలియా టీమ్ ఒకదశ లో ఓడిపోతుంది అని అందరూ అనుకున్నారు కానీ మాక్స్ వెల్ డబుల్ సెంచరీ చేసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ఊచ కోత కోసడనే చెప్పాలి…
ఆస్ట్రేలియా ప్లేయర్లందరూ కూడా తమదైన రీతిలో అద్భుతంగా ఆడుతూ టీమ్ విజయానికి దోహదపడుతున్నారు. మరి ముఖ్యంగా వార్నర్, మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్ లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఈ రెండు టీమ్ లా యొక్క బలబలాలను గనుక చూసుకున్నట్లయితే ఈ రెండు టీంలు బ్యాటింగ్ లో అద్భుతంగా ఉన్నాయి అలాగే పేస్ బౌలింగ్ లో కూడా ఎంత పట్టిష్టంగా ఉన్నాయో, స్పిన్ విభాగం లో కూడా అంతే పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య గెలుపు ఏ టీమ్ ని వరుస్తుంది అనేది చూడటానికి సర్వత్రా ఆసక్తి నెలకొంది…
అయితే ఈ రెండు టీమ్ లు ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో 8 సార్లు తలపడితే అందులో 4 సార్లు సౌతాఫ్రికా గెలిచింది, 3 సార్లు ఆస్ట్రేలియా గెలిచింది, ఒక మ్యాచ్ టై అయింది…అయితే వరల్డ్ కప్ స్టార్టింగ్ నుంచి ఉంటున్న కూడా ఇప్పటి వరకు సౌతాఫ్రికా టీమ్ కి ఒకసారి కూడా వరల్డ్ కప్ రాలేదు దాంతో ఈసారి ఈ సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా ని చిత్తు చేసి ఫైనల్ లో ఇండియా ని కూడా చిత్తు చేసి కప్పు కొట్టాలని చూస్తుంది…ఇక ఇవాళ్టి మ్యాచ్ కలకత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఆడుతున్నారు కాబట్టి ఆ పిచ్ లో ఎక్కువగా ముందు బ్యాటింగ్ తీసుకున్న వాళ్లే పై చేయి సాధిస్తున్నట్టు గా తెలుస్తుంది ఇక ఇలాంటి క్రమం లో టాస్ ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇక్కడ కీలకం కాబోతుంది…