Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: బిగ్ బాస్ ఉల్టా పల్టా నిర్ణయాలు, బాటమ్ 5ని ఫైనల్ కి పంపే స్కెచ్!

గొడవలు పడి వాదించుకుని చివరికి టాప్ 5 లో శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత స్థానాల్లో అమర్ దీప్,గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక నిలబడ్డారు.

Written By: NARESH, Updated On : November 16, 2023 9:35 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారం రంజుగా సాగుతుంది. షో చివరి దశకు చేరుకుంటుంది. ఇక మిగిలింది ఐదు వారాలు మాత్రమే.కాగా ఇప్పటికే ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టేందుకు మరో కొత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ప్రతి సీజన్ లో ఉండే ర్యాంకింగ్ టాస్క్ .. ఇప్పుడు కూడా నిర్వహించారు. అయితే నెంబర్ వన్ స్థానం నాదంటే .. నాదంటూ హౌస్ మేట్స్ తన్నుకున్నారు. అయితే మెజారిటీ హౌస్ మేట్స్ ఇచ్చిన ర్యాంక్ వాళ్లకు సొంతం అవుతుంది.

గొడవలు పడి వాదించుకుని చివరికి టాప్ 5 లో శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత స్థానాల్లో అమర్ దీప్,గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక నిలబడ్డారు. కాగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంశం తెరపైకి తెస్తూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇది ఉల్టా ఫుల్టా సీజన్ కావడంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందడం కోసం బాటమ్ ఫైవ్ పోటీ పడతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే తన ముద్దు బిడ్డ రతికని నామినేషన్స్ నుంచి కాపాడేందుకు బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం.

అయితే ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రతిక రోజ్ కి వచ్చేలా చేయాలని బిగ్ బాస్ అనుకున్నాడు. ఎందుకంటే రతిక బిగ్ బాస్ ముద్దు బిడ్డ. మొదటి సారి ఎలిమినేట్ అయిపోయినా సరే .. ఆమెను పిలిచి మరీ రీ ఎంట్రీ ఇచ్చాడు. రతిక రీ ఎంట్రీ తర్వాత కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెడుతూ.. గత నామినేషన్స్ లో కూడా కంటెంట్ బాగా ఇచ్చింది. బిగ్ బాస్ కంటెంట్ ఇచ్చేవాళ్ళని కాపాడుకుంటాడు అని టాక్.

ఈ క్రమంలో ఆమెకు ఎవిక్షన్ పాస్ ఇప్పించాలని బిగ్ బాస్ ప్లాన్ వేశారని సమాచారం. అందుకే టాప్ 5 లో ఉన్న వారిని కాకుండా .. బాటమ్ ఫైవ్ లో ఉన్న రతిక కి అవకాశం దక్కేలా గేమ్ ని మార్చేశాడు బిగ్ బాస్. కానీ ఇంత ప్రయత్నం చేసినా కూడా .. లాభం లేకుండా పోయింది. ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ ఎవిక్షన్ పాస్ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ నిర్వహించాడు. ఈ టాస్క్ లో అమర్, అర్జున్, అశ్విని, రతిక, గౌతమ్ పోటీపడ్డారు. అర్జున్ గెలిచి అవిక్షన్ పాస్ దక్కించుకున్నారు. ఈ అవిక్షన్ పాస్ తో అర్జున్ ఫైనల్ కి చేరే ఛాన్స్ ఉంది.