Australia Vs South Africa Semi Final: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రెండో సమీఫైనల్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య గురువారం ప్రారంభమైంది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ మొదట బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచడం ద్వారా ఒత్తిడి ఉండదని, గతంలో నాలుగుసార్లు ఒత్తిడితో ఫైనల్‌కు చేరుకోలేదని భావించింది. కానీ, బ్యాటింగ్ ఆశలు నిరాశలే అవుతున్నాయి. మొదటి పదోవర్లలో రెండు వికెట్లె కల్పోయిన సౌత్‌ఆఫ్రికా కేవలం 18 పరుగులు మాత్రమే చేసి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్ కప్‌లో పవర్ ప్లేలో ఇంత తక్కువ స్కోర్ చేయడం ఇదే తొలిసారి.
గతంలో ఇలా..
ఇక గత వరల్డ్ కప్ రికార్డులు చూస్తే.. ఇదే ఏడాది భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 14 పరుగులు చే సింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన మొదటి జట్టుగా శ్రీలంక నిలవగా, రెండో జట్టుగా సౌత్‌ఆఫ్రికా నిలిచింది. చిన్న చిన్న జట్లు అయిన నెదర్లాండ్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా పవర్‌ప్లేలో 30కి పైగా పరుగులు చేశాయి. 2015లో పాకిస్తాన్ పదోవర్లలో 14/2, జింబాబ్వేపై నమోదు చేసింది. 2011లో కెనడా కూడా 14/2 పరుగులు జింబాబ్వేపై చేసింది. ఇదే ఏడాది వెస్టిండీస్‌కూడా పాకిస్తాన్‌పై 18/2 పరుగులు తక్కువ స్కోర్ మొదటి పదోవర్లలో నమోదు చేసింది.
వరణుడు కరుణిస్తేనే..
ప్రస్తుతం సౌత్‌ఆఫ్రికా ఆటతీరు చూస్తుంటే ఫైనల్‌కు వెళ్లడం దాదాపు సాధ్యమయ్యేలా లేదు. ఇప్పటికే 15 ఓవర్లలో 40/4 పరుగులు మాత్రమే చేసింది. ఇదే ఆటతీరు కొనసాగితే 100 నుంచి 150 పరుగులకు ఆలౌట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే వరుణుడు పొంచి ఉండడంతో మ్యాచ్ నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో వరణుడి కారణంగా ఆట నిలిచిపోతే మాత్రం సౌల్ ఆఫ్రికా ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే రిజర్వు డే కూడా ఉంది. కానీ, రేపు కూడా వర్షం తగ్గే అవకాశం లేదు. దీంతో లీగ్‌లో ఎక్కువ పాయింట్లతో ఉన్న సౌత్‌ఆఫ్రికా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. మరి ఐదో ప్రయత్నలో వరణుడి సాయంతో సౌత్‌ఆఫ్రికా ఫైనల్‌కు చేరుతుందా.. లేక ఆస్ట్రేలియానే ఫైనల్‌కు వెళ్తుందా అనేది చూడాలి.