https://oktelugu.com/

Hero Rajasekhar: రాజశేఖర్ ని తీసుకొని ఇబ్బంది పడుతున్న ఎక్స్ ట్రా మూవీ టీమ్…

ఎందుకంటే రాజశేఖర్ తనకి ఇష్టం వచ్చిన టైంకి వస్తున్నట్టుగా అసలు డైరెక్టర్ చెప్పేదేమీ పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే రాజశేఖర్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నప్పటికీ దాన్ని కన్సిస్టెంట్ గా పోషించడం లేదని తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : November 16, 2023 / 04:15 PM IST

    Hero Rajasekhar

    Follow us on

    Hero Rajasekhar: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రాజశేఖర్ అప్పట్లో అంకుశం, శివయ్య, అన్న, అల్లరి ప్రియుడు లాంటి వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. అయితే ఈయన చేసిన సినిమాలు గత కొద్ది సంవత్సరాలుగా పెద్దగా ఆడకపోవడంతో ఆయన హీరోగా చేయాలనే ఆలోచన మానుకొని ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తునట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న ఎక్స్ ట్రా అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా షూటింగ్ లో ఆయన సరిగ్గా పాల్గొనడం లేదనే విషయాలు తెలుస్తున్నాయి.

    ఎందుకంటే రాజశేఖర్ తనకి ఇష్టం వచ్చిన టైంకి వస్తున్నట్టుగా అసలు డైరెక్టర్ చెప్పేదేమీ పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే రాజశేఖర్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నప్పటికీ దాన్ని కన్సిస్టెంట్ గా పోషించడం లేదని తెలుస్తుంది. ఇక ఇప్పుడూ సినిమా డైరెక్టర్ ఈ సినిమాలోకి రాజశేఖర్ ని అనవసరం గా తీసుకున్నం అని తన సన్నిహితులతో చెప్తూ ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈయన ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ ని తీసుకుంటే అయిపోయేది అన్నట్టుగా వంశీ వాపోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే సగం కంటే ఎక్కువ షూటింగ్ ఆయనతో కంప్లీట్ చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ప్లేస్ లోకి వేరే వాళ్ళని తీసుకొని షూట్ చేయాలంటే బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది.

    కాబట్టి మెల్లగా ఆయనతో లాగించేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టార్టింగ్ కి ముందే రాజశేఖర్ ని ఒక కీలక పాత్ర కోసం తీసుకుంటున్నాం అని చెప్పగానే చాలా మంది కూడా ఆయనని ఎందుకు తీసుకుంటున్నారు ఆయన తో చేయడం కష్టం అంటూ చెప్పారట. ఎందుకంటే రాజశేఖర్ ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ చెప్పినట్టు గా వర్క్ చేయకుండా ఆయనకి నచ్చినట్టుగా చేస్తూ లొకేషన్ లో తనకి నచ్చినట్టుగా ఉంటాడు అనే కథనాలు అయితే ఆయన మీద చాలా ఉన్నాయి.

    అందుకే అందరు ఈ సినిమా కి ముందే వంశీ ని హెచ్చరించినట్టు గా తెలుస్తుంది… అయినప్పటికీ ఆ కీలక పాత్ర కి రాజశేఖర్ అయితే బాగుంటుంది అని ఆయన్ని తీసుకున్నందుకు రాజశేఖర్ డైరెక్టర్ కి చుక్కలు చూపిస్తున్నాడు…ఇక రాజశేఖర్ మంచి నటుడే అయినప్పటికీ ఆయన ప్రవర్తించే విధానం చాలామందికి నచ్చదు అందువల్ల ఆయన స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు…