David Warner : పాకిస్తానీ షాహీన్ అఫ్రిదీని ఏం కొట్టాడురా బై.. డేవిడ్ వార్నర్ వీడియో వైరల్…

ఇక వార్నర్ దెబ్బకి ఆస్ట్రేలియా టీం మొదటి రోజు ఆటో ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. అయితే తన కెరీయర్ లో ఈ టెస్ట్ సిరీస్ చివరిది అని చెప్పిన వార్నర్ ఈ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం చెలరేగాడు.

Written By: NARESH, Updated On : December 14, 2023 6:34 pm
Follow us on

David Warner : ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన డేవిడ్ వార్నర్ దూకుడు గా బ్యాటింగ్ చేయడంలో దిట్ట…ఆయన బ్యాటింగ్ ని మనం చాలా సార్లు చూశాం ఫార్మాట్ ఏదైనా కానీ బంతిని మాత్రం ఉతికి ఆరేయడం లో తను ఎప్పుడు ముందుంటాడు. ఇక అందులో భాగంగానే టెస్ట్, వన్డే, టి20 అనే తేడా లేకుండా ప్రతి మ్యాచ్ లో కూడా చెలరేగి అడుతుంటాడు ఒకవంతుకు ఆయనకు బౌలింగ్ చేయాలంటే బౌలర్లందరికి భయం పుడుతుంది.

ఇక ఇలాంటి వార్నర్ పాకిస్థాన్ తో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజే విధ్వంసం సృష్టించాడు. ప్రపంచంలోనే గొప్ప బౌలర్లమని చెప్పుకునే పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అందుకే వార్నర్ ని బెస్ట్ బ్యాట్స్ మెన్ అని చెప్పుకుంటూ ఉంటారు… ఆయన గ్రౌండ్ లో కొట్టే షాట్లకి పాకిస్తాన్ ఫీల్దర్లు అందరూ కూడా నిలబడి చూడడం తప్ప చేసేది ఏమీ లేదు అనెంతలా రెచ్చిపోయి ఆడాడు…ఇక పెర్త్ వేదికగా పాకిస్తాన్ కి ఆస్ట్రేలియాకు మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అందులో మొదటి రోజే వార్నర్ తనదైన రీతిలో 211 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్ లతో 164 పరుగులు చేశాడు. ఆయన బ్యాటింగ్ చూస్తే ఒకానొక టైంలో ఇది టెస్టా లేకపోతే టి20 నా అని అనిపించేంత రేంజ్ లో బౌలర్ల మీద విరుచుకుపడి ఆడటం అంటే మామూలు విషయం కాదు.

ఇక వార్నర్ దెబ్బకి ఆస్ట్రేలియా టీం మొదటి రోజు ఆటో ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది. అయితే తన కెరీయర్ లో ఈ టెస్ట్ సిరీస్ చివరిది అని చెప్పిన వార్నర్ ఈ టెస్ట్ మ్యాచ్ లో మాత్రం చెలరేగాడు. పాకిస్థాన్ ఫీల్డర్లు ఆయన కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే ఆ బాల్ ఎంత వేగంతో గా వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు…

ఇక ఆస్ట్రేలియన్ ప్లేయర్లలో ఉస్మాన్ ఖవాజా 41, మర్నస్ లాబుషెన్ 16,స్టీవ్ స్మిత్ 31, ట్రావిస్ హెడ్ 40 పరుగులు చేశారు…ఇక ప్రస్తుతం మిచెల్ మార్ష్ 15, అలెక్స్ క్యారీ 14 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు..పాక్‌ బౌలర్లలో ఆమీర్‌ జమాల్ 2 వికెట్లు తీయగా, షహీన్ అఫ్రిది, ఖుర్రమ్ షహజాద్‌, ఫహీమ్‌ అష్రాఫ్‌ తలా ఒక వికెట్‌ తీశారు… ఇక మొత్తానికైతే వార్నర్ దెబ్బకి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి…ఇంకోసారి పాకిస్తాన్ బౌలర్లు ప్రపంచం లో మేమే నెంబర్ వన్ బౌలర్లం అని ఎక్కడ చెప్పుకోకుండా ఈ మ్యాచ్ లో వాళ్లందరిని వార్నర్ ఉతికి ఆరేసాడు…షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో మాత్రం పరుగుల వరద పారించాడు…