https://oktelugu.com/

Guntur Karam song controversy : మహేష్ ఫ్యాన్స్ ని కుక్కలతో పోల్చిన రామజోగయ్య శాస్త్రి… అసలేంటి వివాదం!

పూర్తి సాంగ్ విడుదలయ్యాక అసలు ఏం బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆ సాంగ్ బీట్, లిరిక్స్ చాలా సాదాసీదాగా ఉన్నాయి.

Written By: , Updated On : December 14, 2023 / 08:52 PM IST
Follow us on

Guntur Karam song controversy : సోషల్ మీడియా యుగంలో ప్రశంసలు, విమర్శలు క్షణాల్లో సంబంధిత వ్యక్తులకు చేరిపోతున్నాయి. తాజాగా హీరో మహేష్ బాబు కామెంట్స్ ని రచయిత రామజోగయ్య శాస్త్రి తీసుకోలేకపోయారు. ఆయన చాలా ఘాటుగా స్పందించారు. ఏకంగా మహేష్ ఫ్యాన్స్ ని కుక్కలతోపోల్చాడు . అయిత్ ట్వీట్ పెద్ద దుమారం రేపింది. విషయంలోకి వెళితే… గుంటూరు కారం నుండి సెకండ్ లిరికల్ ‘ఓహ్ మై బేబీ’ విడుదలైంది. ఈ సాంగ్ పై ఫ్యాన్స్ అసంతృప్తి చెందారు.

మహేష్ అభిమాని ఒకరు… రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, థమన్ మ్యూజిక్ వరస్ట్ గా ఉన్నాయి. ఆ నిర్మాత నాగ వంశీ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. అసలు ఎటు వెళ్ళిపోతుంది గుంటూరు కారం మూవీ… అని ట్వీట్ చేశాడు. సదరు ట్వీట్ కి రిప్లై ఇస్తూ… సోషల్ మీడియా డాగ్స్. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడతారు. బుర్రలో చెడు ఆలోచనలు పెట్టుకుని, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ, సాంకేతిక నిపుణులను టార్గెట్ చేయడం సహించరానిది. ఎవరో ఒకరు మాట్లాడాలి. గీతలు దాటుతున్నారు, అని ట్వీట్ చేశాడు.

సౌమ్యంగా కనిపించే రామజోగయ్య ఈ స్థాయిలో విరుచుకుపడటంతో అందరూ షాక్ తిన్నారు. అభిప్రాయం చెప్పేదానికి ఒక పద్దతి ఉంది. ప్రతివాడు మాట్లాడేవాడే అంటూ రామజోగయ్య మరో ట్వీట్ చేశాడు. మహేష్ ఫ్యాన్స్ ని కుక్కలు అనేసిన ఆయన గట్స్ కి అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. ‘ఓహ్ మై బేబీ’ ప్రోమో వచ్చినప్పటి నుండి ఫ్యాన్స్ విమర్శలు స్టార్ట్ చేశారు. కాపీ ట్యూన్ అని సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు.

పూర్తి సాంగ్ విడుదలయ్యాక అసలు ఏం బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆ సాంగ్ బీట్, లిరిక్స్ చాలా సాదాసీదాగా ఉన్నాయి. ఒక స్టార్ హీరో రేంజ్ ఎక్కడా కనిపించలేదు. గుంటూరు కారం విషయంలో థమన్ అనేక విమర్శలు ఎదుర్కున్నాడు. సమయానికి ట్యూన్స్ చేయడం లేదని మహేష్ కోప్పడ్డారని కథనాలు వెలువడ్డాయి. ఒక దశలో ప్రాజెక్ట్ నుండి తప్పించారని కూడా పుకార్లు వినిపించాయి. అలాగే గుంటూరు కారం షూటింగ్ సవ్యంగా సాగలేదు.

ప్రాజెక్ట్ మొదలయ్యాక ఆగిపోయింది. మరలా ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. పూజ హెగ్డే తప్పుకుంది. కెమెరా మెన్ మారిపోయాడు. ఇలా అనేక అవకతవకల నడుమ హడావుడిగా సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు. గుంటూరు కారం అవుట్ ఫుట్ పై ఫ్యాన్స్ కి అనేక సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓహ్ మై బేబీ సాంగ్ వాళ్ళను మరింత భయపెట్టింది…

Oh My Baby Lyrical Song | Guntur Kaaram Songs | Mahesh Babu | Thaman S | Telugu Romantic Songs