https://oktelugu.com/

IND vs AUS 1st Test : ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.. భారత్ కొట్టిన దెబ్బకు.. ఆస్ట్రేలియాకు ఇది అనుభవంలోకి వచ్చింది..

ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.. ఈ సామెత ఆస్ట్రేలియా జట్టుకు అనుభవంలోకి వచ్చింది. వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత 150 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా జట్టు సంబరాలు చేసుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2024 / 09:53 AM IST

    IND vs AUS 1st Test

    Follow us on

    IND vs AUS 1st Test : ఆస్ట్రేలియా జట్టు చేసుకున్న ఆ సంబరాలు గాలిలో కొట్టుకుపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. పేస్, బౌన్స్ కు అనుకూలంగా ఉన్న మైదానంపై భారత బౌలర్లు కూడా అద్భుతాలు సృష్టించారు. అయితే ఈ మైదానంపై టీమిండియాను 150 పరుగులకే ఆల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు విజయవంతమైనప్పటికీ.. టీమిండియా ముందు నిల్వలేకపోయింది. ఏ మైదానం పైన అయితే ఆస్ట్రేలియా బౌలర్లు సత్తా చాటారో.. అంతకుమించి అన్నట్టుగా భారత బౌలర్లు అద్భుతాలు సృష్టించారు. ఆస్ట్రేలియాలో సుమారు ఐదుగురు బౌలర్లు బౌలింగ్ చేయగా.. భారత్ నుంచి కేవలం ముగ్గురు బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేశారు. వారి ముగ్గురు ఆస్ట్రేలియా జట్టు టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించారు. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. హర్షిత్ రాణా ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తాను తీసుకున్న గోతిలో తానే పడింది. పేస్ బౌలింగ్ తో భారత జట్టును దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియా.. చివరికి అదే పేస్ బౌలింగ్ దెబ్బకు తోకముడిచింది.. భారత బౌలర్లు స్టన్నింగ్ డెలివరీలు వేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు వణికి పోయారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఒకవేళ మ్యాచ్ ఇంకాస్త సాగితే ఆస్ట్రేలియా జట్టు అయ్యేదే.

    శనివారం నాటి ఆట రసవత్తరం..

    ఇక శనివారం నాటి ఆట మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఆస్ట్రేలియా చేతుల్లో మూడు వికెట్లు ఉన్నాయి.. క్రీజ్ లో క్యారీ (19) మాత్రమే అనుభవజ్ఞుడైన ఆటగాడు. బుమ్రా ఎలాగూ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసే అవకాశం లేదు. అలాంటప్పుడు ఆస్ట్రేలియన్ 100 పరుగుల లోపు ఆల్ అవుట్ చేస్తే.. టీమ్ ఇండియాకు 50 పరుగుల లీడ్ లభిస్తుంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటితే ఆస్ట్రేలియా జట్టుకు ఇబ్బందులు తప్పవు. ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా 83 పరుగులు వెనుకబడి ఉంది. అంటే మొత్తంగా శనివారం జరిగే ఆట మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది.. అయితే మైదానం పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో బ్యాటర్లు స్థిరంగా నిలబడి పరుగులు చేయడం కష్టమవుతోంది. ఇది భారత జట్టుకు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కూడా అనుభవంలోకి వచ్చింది. మరి శనివారం నాటి ఆటను ఆస్ట్రేలియా జట్టు ఎలా ప్లాన్ చేసిందో.. కొద్ది గంటలు గడిస్తే గాని తెలియదు. అయితే భారత జట్టు మాత్రం ఆస్ట్రేలియాను 100 పరుగుల లోపు ఆలౌట్ చేయాలని గట్టి ప్రణాళికలతో ఉంది. ఇదే విషయాన్ని కెప్టెన్ బుమ్రా తన సహచరులతో వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.