https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఈ వారం ఓటింగ్ ముగిసే సమయానికి నిఖిల్, నబీల్ తప్ప అందరూ డేంజర్ జోన్..ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే!

ఈ వారం విన్నూతన రీతిలో జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ద్వారా, ఓజీ క్లాన్ మొత్తం నామినేషన్స్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆరవ వారం తర్వాత వరుసగా వైల్డ్ కార్డ్స్ మాత్రమే ఎలిమినేట్ అవుతూ ఉన్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 23, 2024 / 09:50 AM IST

    Bigg Boss Telugu 8: By the end of this week's voting, everyone except Nikhil and Nabeel is in the danger zone..who will be eliminated!

    Follow us on

    ఈ వారం విన్నూతన రీతిలో జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ద్వారా, ఓజీ క్లాన్ మొత్తం నామినేషన్స్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆరవ వారం తర్వాత వరుసగా వైల్డ్ కార్డ్స్ మాత్రమే ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. అందుకే ఈసారి బిగ్ బాస్ భారీ స్కెచ్ వేసి ఓజీ నుండి ఒకరిని బయటకి పంపేయాలనే ఉద్దేశ్యంతోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ లోపలకు పంపి నామినేట్ చేయించాడు. బిగ్ బాస్ ప్లాన్ ఫలించింది. ఈ వారం ఒకరు, లేదా డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు ఓజీ క్లాన్ నుండి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ ప్రకారం చూస్తే నిఖిల్, నబీల్ తప్ప మిగిలిన ముగ్గురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. నిఖిల్ ఓటింగ్ అయితే ఈ వారం ఎవ్వరూ అందుకోలేని రేంజ్ లో ఉంది.

    ఆయన ఒక్కడికే 50 శాతం కి పైగా ఓట్లు పడ్డాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, నిఖిల్ రేంజ్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది. అతనిపై సీత వేసిన నిందలు కూడా జనాల్లో నిఖిల్ పై సానుభూతి ని పెంచి ఓటింగ్ ఈ రేంజ్ లో పెరగడానికి కారణం అయ్యింది. ఇక రెండవ స్థానంలో చాలా కాలం తర్వాత నామినేషన్స్ లోకి వచ్చిన నబీల్ ఉన్నాడు. వరుసగా ఆరు వారాలు నామినేషన్స్ లోకి రాలేదు కదా, నబీల్ గ్రాఫ్ బాగా పడిపోయి ఉంటుంది అని అందరూ పొరపాటు పడ్డారు. కానీ ఆయన గ్రాఫ్ ఇసుమంత కూడా తగ్గలేదని ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన తర్వాతే అర్థమైంది. ఇక మూడవ స్థానంలోకి పృథ్వీ వచ్చాడు. ఈ వారం ఆయన కష్ట సమయంలో తన స్నేహితుడు నిఖిల్ కోసం తీసుకున్న స్టాండ్ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను కదిలించింది. స్నేహం కోసం ఇంత విలువ ఇచ్చే కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లోనే లేరు అంటూ ఈయనపై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపించారు.

    ఇక చివరి రెండు స్థానాల్లో ప్రేరణ, యష్మీ మిగిలారు. ప్రేరణ అసలు డేంజర్ జోన్ లో వస్తుందని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఒకానొక దశలో ఆమె ఓటింగ్ నిఖిల్ ని కూడా దాటేసింది. ఆ స్థాయి నుండి పాతాళ లోకంలోకి పడిపోవడం బాధాకరం. గత నాలుగు వారాలుగా ఆమెకు వరుసగా నెగటివ్ ఎపిసోడ్స్ పడుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మెగా చీఫ్ అయ్యింధో, ఆమె గొయ్యని ఆమెనే తవ్వుకున్నట్టు అయ్యింది. పైగా ఈ వారం మొత్తం ఆమె ఆడింది ఏమి లేదు. వాస్తవానికి ఆడేందుకు ఆమెకు స్కోప్ రాలేదు. అందుకే గ్రాఫ్ పడిపోయి డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఇక చివరి స్థానంలో యష్మీ ఉంది. ఈమె ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించిందే. లవ్ ట్రాక్స్ నడిపి గేమ్ ని ఎప్పుడో మర్చిపోయింది. ఈ వారం ట్రాక్ లోకి వచ్చి గేమ్ బాగా ఆడినప్పటికీ కూడా ఓటింగ్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఫలితంగా ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ పెడితే ప్రేరణ కూడా ఎలిమినేట్ అవ్వొచ్చు.