Bigg Boss Telugu 8 : ఈ సీజన్ లో కచ్చితంగా టాప్ 5 లోకి వెళ్తుంది అని అనుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణ. ఆడపులి లాగా ఈమె ఎన్నో టాస్కులు మగవాళ్ళతో సమానంగా ఆడి గెలిచి శబాష్ అనిపించుకుంది. అంతే కాకుండా నామినేషన్స్ లో ఈమె పెట్టే పాయింట్స్ ముందు ఎవరైనా డామినేట్ అవ్వాల్సిందే, ఆ రేంజ్ లో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే, చూసేందుకు చాలా క్యూట్ గా ఉంటుంది, చిన్న పిల్లలాగా మాట్లాడుతుంది. ఇవన్నీ ఆడియన్స్ కి తెగ నచ్చేవి, అందుకే ఈమె టాప్ 5 లో ఉంటుంది, ఒకానొక దశలో మొట్టమొదటి మహిళా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని కూడా అనుకున్నారు విశ్లేషకులు. కానీ గత నాలుగు వారాల్లో సీన్ మొత్తం మారిపోయింది. ఈమె అసలు రంగు బయటపడిన తర్వాత ఎవరెస్ట్ లాంటి గ్రాఫ్ పాతాళ లోకంలోకి పడిపోయింది. సహాయం చేసే వాళ్లకు వెన్నుపోటు పొడవడం, ఒక కంటెస్టెంట్ గురించి చెడుగా వేరే కంటెస్టెంట్ తో మాట్లాడడం, కన్నింగ్ ఆలోచనలు చేయడం, బలుపుతో ప్రవర్తించడం, ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవడం వంటివి ఈమె పతనానికి కారణం అయ్యింది.
ఇక మెగా చీఫ్ అయిన తర్వాత ఈమె ప్రవర్తించిన తీరు చాలా ఛండాలంగా ఉంది. చీఫ్ గా వ్యవహరించకుండా, ఈమె ఎదో పెద్ద డిక్టేటర్ అయ్యినట్టు ప్రవర్తించింది. ప్రతీ ఒక్కరి పట్ల బలుపుని ప్రదర్శించింది. ఫలితంగా టాప్ 5 లో ఉండాల్సిన ఈమె ఈ వారం డేంజర్ జోన్ లోకి వచ్చినంత పని అయ్యింది. మరోపక్క రోహిణి గ్రాఫ్ నిన్నటి ఎపిసోడ్ తో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఈ సీజన్ గౌతమ్ గ్రాఫ్ ఎలా అయితే అమాంతం పెరిగి టైటిల్ రేస్ లోకి వచ్చే రేంజ్ లో పెరిగిందో, రోహిణి గ్రాఫ్ కూడా టాప్ 10 నుండి టాప్ 5 లోకి వచ్చే రేంజ్ లోకి వెళ్ళిపోయింది. టాప్ 5 లో ఉన్న ప్రేరణ స్పాట్ ని రోహిణి దాదాపుగా లాగేసుకున్నట్టే అని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ పంచడంలో కానీ, ఎదుటి వ్యక్తితో ప్రవర్తించే తీరు విషయంలో కానీ, టాస్కుల విషయంలో కానీ ఈమె అన్ని విధాలుగా ప్రేరణ, విష్ణు ప్రియ బెస్ట్ అని ఈమధ్య కాలంలో అనిపించింది. అందుకే ఈమె టాప్ 5 లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.
టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, నబీల్, రోహిణి స్పాట్స్ దాదాపుగా ఫిక్స్ ఐపోయినట్టే. ఇప్పుడు 5 వ స్థానం కోసం ప్రేరణ, అవినాష్, టేస్టీ తేజా పోటీ పడుతున్నారు. అవినాష్ టాప్ 5 లోకి వచ్చే అవకాశాలు తక్కువ, కానీ టేస్టీ తేజ టాప్ 5 లోకి వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఈ సీజన్ లో ఆయన తన శక్తిని మొత్తం ఉపయోగించి, ఎంతవరకు అయితే ఆడగలడో అంత వరకు ఆడుతూ వస్తున్నాడు. వచ్చే వారం ఆయనకి ఒక్క భారీ ఎపిసోడ్ పడినా టాప్ 5 లోకి వచ్చేస్తాడు. ఇక ప్రేరణ మళ్ళీ టాప్ 5 లోకి రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి, ఎప్పుడు ఏదైనా జరగొచ్చు, గ్రాఫ్స్ మారొచ్చు అనేది మనకి గత నాలుగు వారాల్లోనే అర్థమైంది.