ENG vs AUS Champions Trophy
ENG vs AUS : ఆస్ట్రేలియా విజయంలో ఇంగ్లిస్ కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలో సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆశలు మొత్తం హెడ్ మీదే ఉండేవి. ఎందుకంటే అతడు సూపర్ మెన్ తరహాలో ప్రదర్శన చేస్తాడు. అద్భుతమైన తరహాలో ఆడతాడు. కానీ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికి అతడు అవుట్ కావడంతో ఒక్కసారిగా షాక్ నెలకొంది. హెడ్ లాంటి ఆటగాడు అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఈ టార్గెట్ చేదించలేదనే అంచనా అందరిలోనూ నెలకొంది. దీంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ కంగారులకు కష్టమే అనే భావన ఏర్పడింది. వాస్తవానికి ఇంగ్లాండ్ తో పోటీ అంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెచ్చిపోతారు. ముఖ్యంగా హెడ్ లాంటి ఆటగాళ్లు ఊచ కోత కోస్తారు. కానీ హెడ్ నుంచి అలాంటివేవీ సాధ్యం కాలేదు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో హెడ్ దొరికిపోవడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
ఆస్ట్రేలియా ఎదుట 352 రన్స్ టార్గెట్ విధించిన తర్వాత ఇంగ్లాండ్ ప్రారంభ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు పరుగులు రావడం చాలా వరకు కష్టమైపోయింది. ఈ దశలో జఫ్ఫా ఆర్చర్ నాలుగో ఓవర్ తొలి బంతిని స్ట్రైట్ డెలివరీ గా వేశాడు. ఆ బంతికి ఉవ్విళ్ళూరిన హెడ్.. అదే పనిగా షాట్ ఆడాడు. అయితే జోప్రా ఆర్చర్ ఎడమచేత్తో ఆ బంతిని పట్టుకున్నాడు. ఎంతో వేగంగా వచ్చిన ఆ బంతిని ఎడమచేత్తో చాలా ఒడుపుగా అందుకున్నాడు.. ఫలితంగా హెడ్ ప్రస్థానం ఆరు పరుగుల వద్ద ముగిసింది. ఇటీవల కాలంలో హెడ్ ఇలా అవుట్ కావడం ఇదే తొలిసారి. దీంతో నెటిజన్లు హెడ్ తల పొగరును ఆర్చర్ ఎడమచేత్తో నేలకు దించాలని కామెంట్లు చేస్తున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో హెడ్ వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. అతడి వల్లే టీమిండియా కు ట్రోఫీ దూరమైన విషయం విధితమే. దానిని దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ అభిమానులు హెడ్ కు దూల తీరిందని.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై తిక్క తిక్క కామెంట్లు చేస్తే ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ” ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికీ.. అంత భారీ స్కోరు చేసి ఆస్ట్రేలియా ఎదుట తలవంచినప్పటికీ.. ఆర్చర్ హెడ్ వికెట్ తీసిన తీరు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆర్చర్ హెడ్ తల పొగరును కిందికి దించాడు.. అది మామూలు విషయం కాదు. సగటు ఆస్ట్రేలియా అభిమానికి అది ఒక తలవంపు లాంటిదని” టీమిండి అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
No Rohit led Indian team, No party for Travis Head.
Great start of the Champions Trophy for Travis Head pic.twitter.com/DF4cHsuXim
— TukTuk Academy (@TukTuk_Academy) February 22, 2025