Natural Star Nani Replay
Natural Star Nani : మీడియా ముందుకు వచ్చినప్పుడు హీరోలను, హీరోయిన్లను కొంతమంది రిపోర్టర్స్ చాలా చిరాకు కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారు అనే విషయం తెలిసి కూడా అడుగుతారు. ఎందుకంటే సోషల్ మీడియా లో అలాంటి ప్రశ్నలు బాగా వైరల్ అవ్వాలి అనేదే వాళ్ళ ఉద్దేశ్యం కాబట్టి. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్'(Court Movie) అనే చిత్రం వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో విలేఖరులు అనేక ప్రశ్నలు సంధించారు. కొన్ని సినిమాకి సంబంధించినవి అయితే, మరి కొన్ని మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లి అడిగారు. అందుకు నాని కాస్త చిరాకు పడినట్టుగా అనిపించింది.
ఒక విలేఖరి నాని ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ చిత్రం పోక్సో చట్టాన్ని బేస్ చేసుకొని తీశారు కదా, మని జానీ మాస్టర్(Jani Master) కేసు కి మీ సినిమా స్టోరీ కి ఏమైనా లింక్ ఉందా?, బయట జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీసారా?’ అని అడగగా, దానికి నాని సమాధానం ఇస్తూ ‘ ఈ సినిమాకి, జానీ మాస్టర్ కేసు కి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆ సబ్జెక్టు లైన్ లో ఈ సినిమా ఉండదు. మీకు ఇష్టమొచ్చిన కథలను అల్లి ప్రచారం చేయొద్దు’ అంటూ చెప్పుకొచ్చాడు. పోక్సో యాక్ట్ మీద సినిమా తీస్తున్నారు, ఏదైనా తేడా జరిగితే కేసు అవ్వుద్ది అని మరో రిపోర్టర్ అడగగా, దానికి నాని సమాధానం చెప్తూ ‘మేము ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయడం లేదు. చట్టం గురించి స్టడీ చేసి, రీసెర్చ్ చేసి తీసాము. సెన్సార్ సభ్యులు మద్దతు ఇచ్చే విధంగానే మా చిత్రాన్ని తీర్చి దిద్దాము. ఎలాంటి సమస్యలు రావు’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
ఈ సినిమాని ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా తీశామని, డైరెక్టర్ నాకు ఏదైతే చెప్పి ఈ సినిమాని ఒప్పించాడో, అంతకు మించిన బెస్ట్ ఔట్పుట్ అందించాడని, ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత చాలా సంతృప్తి చెందాను అంటూ నాని చెప్పుకొచ్చాడు. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని, ట్రైలర్ చూసిన తర్వాత మా సినిమా రేంజ్ ఏమిటి అనేది మీ అందరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మాతగా వరుసగా విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న నాని, ఈ చిత్రం తో తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.