AUS vs WI: వెస్టిండీస్ ఆస్ట్రేలియా టీమ్ ల మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా మూడోవ వన్డే మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించింది. కేవలం 6.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
ఇక క్యాన్ బెర్ర వేదికగా ఆడిన ఈ మూడోవ వన్డే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 24.1 ఓవర్లలో 86 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక దాంతో 87 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్ ప్లేయర్లు కేవలం 6.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ మ్యాచ్ కేవలం 186 బంతుల్లోనే ఫలితం తేలడం విశేషం.. ఇక దాంతో పాటుగా అతి తక్కువ బంతుల్లో ముగించిన మ్యాచ్ ల్లో ఈ మ్యాచ్ కూడా ఒకటిగా నిలిచింది. ఇక ముందుగా నేపాల్ vs యుఎస్ఏ మ్యాచ్ 104 బంతుల్లో ఫలితం తేలగా, శ్రీలంక vs జింబాబ్వే (120 బంతులు), శ్రీలంక vs భారత్ (123 బంతులు),కెనడా vs శ్రీలంక (140 బంతులు), జింబాబ్వే vs శ్రీలంక (164 బంతులు) గెలిచి టాప్ 5 లో చోటు దక్కించుకున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ ప్లేయర్లలో ఓపెనర్ ప్లేయర్ అయిన అంతేజే 32, రోస్టన్ చేజ్ 12, కేసి కార్టి 10 పరుగులు చేశారు. ఇక వీళ్ళని మినహాయిస్తే వెస్టిండీస్ టీమ్ లో ఏ ఒక్క ప్లేయర్ కూడా రెండంకెల పరుగులు చేయలేదు…ఇక ఆస్ట్రేలియన్ బౌలర్లలో జేవియర్ నాలుగు వికెట్లు తీయగా, ఆడమ్ జంపా, లాన్స్ మోరిస్ చెరో 2 వికెట్లు తీశారు…
ఇక ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ లలో జోక్ ఫ్రేజర్ 18 బంతుల్లో 41 పరుగులు చేశాడు, ఇంగ్లీస్ 16 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు… ఇక వీళ్లిద్దరూ వెస్టిండీస్ బౌలర్ల పైన విరుచుకుపడి ఆడడంతో ఆస్ట్రేలియన్ టీం భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీంతో మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 3-0 తేడా తో గెలిచి వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి…