Tollywood Heroes: స్టార్లుగా ఎదగాలంటే సినీ బ్యాగ్రౌండ్ ఉండాల్సిందేనా? ఈ హీరోల విషయంలో క్లారిటీ వచ్చేసిందా?

ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమా? స్టార్లుగా ఎదగడం కష్టమా? అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలా మంది స్టార్లు ఫ్యామిలీ సపోర్ట్ తో ఎంట్రీ ఇచ్చినవారే.

Written By: Swathi, Updated On : February 7, 2024 10:32 am

Tollywood Heroes

Follow us on

Tollywood Heroes: తెలుగు ఇండస్ట్రీలో వారికంటూ స్పెషల్ గుర్తింపు సంపాదిస్తూ ఎన్నో కష్టాలు పడుతూ కొందరు పైకి వస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం సినీ బ్యాగ్రౌండ్ ఉండడంతో ఈజీగా ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఈజీ అయినా స్టార్ డం ను రాబట్టడం కష్టం. దాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టం. అయితే కొందరు మాత్రం ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇస్తుంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు చాలా మంది స్టార్ స్టేటస్ ను సంపాదిస్తున్నారు. అదే తరహాలో వారి ఎంట్రీని పదిలం చేసుకుంటున్నారు కూడా.

అయితే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమా? స్టార్లుగా ఎదగడం కష్టమా? అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలా మంది స్టార్లు ఫ్యామిలీ సపోర్ట్ తో ఎంట్రీ ఇచ్చినవారే. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్లకు మంచి సినీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కొందరు హీరోలు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తమదైన ముద్ర వేసుకున్నారు.

కానీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేని ఏ ఒక్క హీరో కూడా స్టార్ హీరోగా లేరనేది కూడా వాస్తవే. విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయినా మెయిన్ హీరోల మాదిరి స్టేటస్ ను మాత్రం సంపాదించలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ హీరో మెయిన్ స్టార్ల లిస్ట్ లో చేరలేకపోయాడు. దానికి కారణం అర్జున్ రెడ్డి తర్వాత ఆయనకు సరైన సక్సెస్ లేదు. అయితే ఇదే మాదిరి హిట్ కనుక మరో స్టార్ హీరో కొడుకుకు వచ్చి ఉంటే.. వెంటనే ఆయన స్టార్ గా ఎదిగిపోయేవారు.

స్టార్ స్టేటస్ వస్తే స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమాలను సెట్ చేసుకొని వారి సినీ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందా అనే మాటకు ఇప్పటికీ సరైన సమాధానం మాత్రం లేదు. ఇదిలా ఉంటే యాక్టింగ్ రాకుండా ఎంట్రీ ఇస్తే నెపోటిజం అసలు సహాయం చేయదనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే అలా ఎంట్రీ ఇచ్చిన కొందరు మంచి హీరోలుగా కూడా రాణించలేదు. ఎందుకంటే ఫ్లాప్ లతో వారి ఖాతాలు నిండిపోతుంటాయి. ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడానికి స్కోప్ ఉండడంతో ఆయన స్టార్ అయ్యారు. కానీ ప్రస్తుతం నాని, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి హీరోలు మాత్రం ఎంత మంచి సినిమాలు తెరకెక్కించినా టైర్ 2 హీరోలుగానే ఉండిపోతున్నారు కానీ స్టార్ హీరోలుగా ఎదగడం లేదు.