Marcus Stoinis : ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు వీడ్కోలు చెప్పాడు.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆ జట్టులో స్టోయినీస్ ఉన్నాడు. అయితే టోర్నీకి ముందు అతడు ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అయితే పొట్టి ఫార్మాట్ పై పుట్టి స్థాయిలో దృష్టిసారించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్టోయినీస్ పేర్కొన్నాడని ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది. ” దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. మేజర్ టోర్నీలలో జాతీయ జట్టుకు ఆడటం ఆనందకరమైన సందర్భం. కానీ ఇప్పుడు నేను ఆ స్థాయిలో ప్రదర్శన చేసే అవకాశం లేదు. సరైన సమయంలోనే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు నేను భావిస్తున్నాను. మా కెరియర్లో తర్వాతి అధ్యాయం పై దృష్టి సారించాను.. ఆస్ట్రేలియా మెక్ డోనాల్డ్ తో నాకు మంచి స్నేహం ఉంది. అతనితో ఏర్పడిన బాండింగ్ నన్ను తర్వాతి దశకు తీసుకు వెళ్తుందని అనుకుంటున్నాను. అతడు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాడు. కాకపోతే నా కెరియర్ ఇలా ఉండాలని నేను అనుకోవడం లేదు. తర్వాత దశ ఏంటనేది ఇప్పటికే నిర్ణయించుకున్నాను. ఇకపై నా పూర్తిస్థాయి ఆటను t20 క్రికెట్ కు పరిమితం చేస్తానని” మార్కస్ స్టోయినిస్ పేర్కొన్నాడు.
కెరియర్ ఇలా..
స్టోయినిస్ కు పై 35 సంవత్సరాలు. అతడు ఇప్పటివరకు 71 వన్డేలు ఆడాడు. 1,495 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 48 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే తన చివరి వన్డే మ్యాచ్ ను ఆస్ట్రేలియా తరఫున పాకిస్తాన్ పై స్టోయినిస్ ఆడాడు. ఆ మ్యాచ్లో అతడు 8 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ వేసి 11 పరుగులు ఇచ్చాడు. కాగా, ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన ఆటగాళ్లలో ఇప్పటికే కమిన్స్, మిచెల్ మార్ష్, జోష్ హేజిల్ వుడ్ గాయాల బారిన పడ్డారు. వారు చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం దాదాపు అనుమానంగానే మారింది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా కోచ్ మెక్ డోనాల్డ్ కూడా పరోక్షంగా ప్రకటించాడు. ” వారు గాయాల బారిన పడ్డారు. పూర్తిస్థాయిలో ఆడతారో లేదో తెలియదు. అయితే మిగతా ఆటగాళ్లను కూడా సిద్ధంగా ఉంచాం.. కెప్టెన్ గా హెడ్ లేదా ఇతర ఆటగాళ్లు వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పూర్తిస్థాయిలో వివరాలు చెప్పలేం. చూడాలి ఏం జరుగుతుందోనని” మెక్ డొనాల్డ్ ప్రకటించాడు.