https://oktelugu.com/

Team India Jersey : కొత్త జెర్సీ అదిరిందయ్యా.. విదర్భలో మెరిసిపోయిన టీమ్ ఇండియా క్రికెటర్లు..

నీలిరంగు టీషర్ట్.. అదే రంగు పాయింట్.. భుజాలపైన త్రివర్ణ పతాకం.. చాతి మీద బీసీసీఐ సింబల్.. ఎడమవైపు అడిడాస్ లోగో.. మధ్యలో డ్రీం లెవెన్, దాని కింద ఇండియా.. ఇదీ టీమిండియా క్రికెటర్లు ధరించిన జెర్సీ కథా కమామీసు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 6, 2025 / 06:43 PM IST
    Team India New Jersey

    Team India New Jersey

    Follow us on

    Team India Jersey : టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో మెరిసిపోయారు. విదర్భ స్టేడియంలో సందడి చేశారు.. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండి ఆటగాళ్లు కొత్త జెర్సీలో దర్శనమిచ్చారు.. జెర్సీ రూపొందించిన విధానం.. తీర్చిదిద్దిన విధానం బాగుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ” భుజాలపై త్రివర్ణ పతాకం ఉంది. చాతి మీద బీసీసీఐ లోగో ఉంది. అటువైపు అడిడాస్ సింబల్ కనిపిస్తోంది. ఆటగాళ్ల దండ చేయి భాగంలో ప్రత్యేక ఆకర్షణగా నీలిరంగు వస్త్రాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. మొత్తంగా చూస్తే జెర్సీ అందంగా కనిపిస్తోంది.. మెన్ ఇన్ బ్లూ కు సరికొత్త ఆకర్షణను తీసుకువచ్చింది. జెర్సీ రూపొందించిన వారికి అభినందనలు. క్రికెట్లో టీమిండియా ఆధిపత్యాన్ని ఈ జెర్సీ ప్రతిబింబిస్తోందని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

    ఆటగాళ్లతో ఫోటోషూట్..

    నూతన జెర్సీ ధరించిన ఆటగాళ్లతో ఇటీవల బీసీసీఐ ఫోటోషూట్ నిర్వహించింది. ఆ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది..” సరికొత్త జెర్సీలతో ఆటగాళ్ల దర్శనం.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ ముందు టీమిండి ఆటగాళ్లు సరికొత్త గ్లామర్ అందుకున్నారు. కొత్త జెర్సీలో ఎలా కనిపిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి అంటూ” బిసిసిఐ వ్యాఖ్యానించింది. గతంలో భారత ఆటగాళ్ల జెర్సీలపై అనేక ఆరోపణలు వినిపించాయి. బిజెపి రంగును ఆటగాళ్ల జెర్సీలపై రుద్దారని కొంతమంది ఆరోపించారు. అయితే ఈసారి అటువంటి వాటికి తావు లేకుండా బీసీసీఐ జెర్సీలను సరికొత్తగా రూపొందించింది. అయితే ఒక్కో జెర్సీకి అడిడాస్ కంపెనీ లక్షల్లోనే ఖర్చు చేసిందని తెలుస్తోంది.. వస్త్రం, డిజైన్ల రూపకల్పనలో అడిడాస్ కంపెనీ ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. అందువల్లే టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు అందంగా కనిపిస్తున్నాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇలాంటి జెర్సీలను రూపొందించిన ఆడిడాస్ కంపెనీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బీసీసీఐ నిర్వహించిన ఫోటోషూట్ లో అందరూ ఆటగాళ్లు పాల్గొన్నారు. అయితే వీరిలో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లాండ్ జట్టుతో మొదలైన మూడు వన్డేల సిరీస్ ద్వారా టీమ్ ఇండియా ఆటగాళ్లు కొత్త జెర్సీని ధరించారు. నాగ్ పూర్ వేదికగా మొదలైన తొలి వన్డేలో కొత్త జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చారు. విదర్భ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.. కొత్త జెర్సీలో దర్శనమిచ్చిన ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు..” వెల్కమ్ టు విదర్భ క్రికెట్ స్టేడియం.. కొత్త జెర్సీలో ఆడేందుకు వచ్చిన టీమిండి ఆటగాళ్లకు స్వాగతం. కొత్త జెర్సీ లాగానే టీమిండియా ఈ ఏడాది అద్భుతమైన విజయాలు అందుకొని.. మరింత మెరిసిపోవాలని” అభిమానులు ఫ్ల కార్డుల ద్వారా ప్రదర్శించారు.