AUS Vs WI 2nd T20 2025: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన ఘనత వెస్టిండీస్ జట్టుకు ఉండేది.. భయంకరమైన బౌలర్లు.. భీకరమైన బ్యాటర్లు.. అద్భుతమైన ఫీల్డర్లు ఆ జట్టులో ఉండేవాళ్లు. గతం ఎంతో ఘనం.. నేడు మాత్రం అధ్వానం అన్నట్టుగా ఆ జట్టు పరిస్థితి మారిపోయింది. జట్టు అద్వాన ఆట తీరుపై మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మేనేజ్మెంట్ తీరని మార్చుకోవాలని సూచిస్తున్నప్పటికీ వెస్టిండీస్ జట్టు రాత మారడం లేదు. ఆటగాళ్లు విజయం కోసం కాకుండా ఏదో ఆడుతున్నాం అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా విండిస్ జట్టు వరుస ఓటములు ఎదుర్కొంటూ పరువు తీసుకుంటున్నది. జింబాబ్వే కంటే నాసిరకమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నది. ఇటీవల జట్టు పాటతీరు పట్ల మాజీ ఆటగాడు లారా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలానే ఆడితే విండిస్ జట్టు క్రికెట్ నుంచి నిష్క్రమించడం మేలు అని వ్యాఖ్యానించాడు.
Also Read: ఈ బంధమూ పెటాకులు.. పాపం హార్దిక్ భయ్యా.. ఏంటీ నీకు ఈ కష్టాలు?
స్వదేశంలో కంగారు జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను విండీస్ జట్టు 0-3 తేడాతో కోల్పోయింది. మూడో టెస్టులో ఒక ఇన్నింగ్స్ లో అయితే 27 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత సీనియర్ ప్లేయర్లు జట్టు ఆటగాళ్లు తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి పట్ల మండిపడ్డారు. సరైన ఆదాయం లేకపోవడంతో విండీస్ జట్టు ఆటగాళ్లు విదేశాలలో t20 టోర్నీలు ఆడుతున్నారని.. తద్వారా జాతీయ జట్టును నిర్లక్ష్యం చేస్తున్నారని దెప్పి పొడిచారు. అయినప్పటికీ ఆటగాళ్లు ఆట తీరు మార్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
Also Read: ధోని చెప్పిన ఓ మంచి మాట
టెస్ట్ సిరీస్ కోల్పోయిన విండీస్ జట్టు టి20 సిరీస్ లోను అదే వైఫల్యం కొనసాగిస్తున్నది. ఇప్పటికే తొలి టి20 మ్యాచ్ లో ఓటమిపాలైన వెస్టిండీస్ జట్టు.. రెండో మ్యాచ్ లోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. జమైకాలోని సబీన పార్కులో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 172 పరుగులు చేసింది. కింగ్ 51, ర సెల్ 36 పరుగులు చేశారు. జంపా మూడు వికెట్లు పడగొట్టాడు.. అనంతరం 173 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన కంగారు జట్టు ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి, 15.2 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది.. ఇంగ్లీస్ 78, గ్రీన్ 56 పరుగులు చేసి కంగారు జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు.. ఆతిథ్య జట్టులో హోల్డర్, జోసెఫ్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదు టి20 మ్యాచ్లో సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి పర్యాటక జట్టు 2-0 లీడ్ లో కొనసాగుతోంది. మూడో మ్యాచ్ జూలై 25న జరుగుతుంది.