AP Good news for farmers:రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం( AP government). కొత్త పాసుపుస్తకాలు అందించేందుకు సిద్ధమయింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న జగన్ ఫోటోతో పాసుపుస్తకాలు ముద్రించిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బొమ్మను తొలగించింది. ఈ సర్వే పూర్తిచేసిన గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో రైతులకు ఈ పాస్ పుస్తకాలు అందినట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాసుపుస్తకాలు అందించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఎటువంటి రుసుం అవసరం లేదు. ఉచితంగానే అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
Also Read: బంగాళాఖాతం నుంచి హెచ్చరిక.. ఏపీ వైపు ప్రళయం!
ఇప్పటికే పాస్ పుస్తకాల పంపిణీ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో చాలా గ్రామాల్లో భూముల రీ సర్వే జరిగింది. అటువంటి గ్రామాల్లో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించారు. అయితే ఆ పుస్తకాలపై జగన్ బొమ్మతో పాటు నవరత్నాల గుర్తు ఉండేది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రైతుల భూముల పుస్తకాలపై ప్రభుత్వ పెద్దల ఫోటోలు ఏంటన్న ప్రశ్న వినిపించింది. మొన్నటి ఎన్నికల్లో విపక్షాలకు అదే ప్రచార అస్త్రంగా మారింది. ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్ళింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మూల్యం చెల్లించుకుంది. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి ఫోటోలు లేకుండా పాస్ పుస్తకాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు అందించే ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఈ పాస్ పుస్తకాలను ఆగస్టు 15 నుంచి పూర్తిస్థాయిలో అందించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Also Read: ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి ఏర్పాట్లు ఇవీ
భూముల రీసర్వే పై ఫోకస్..
మరోవైపు పెండింగ్ లో ఉన్న భూముల రీసర్వే( land researvay ) సైతం వీలున్నంత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం అయింది. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేలో చాలా రకాల తప్పులు దొర్లాయి. రైతులకు చాలా రకాల ప్రతికూలతలు ఎదురయ్యాయి. ఇటువంటి తరుణంలో వాటిని అధిగమించి.. రైతులకు ఉపయోగపడేలా భూముల రీసర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వైసిపి హయాంలో చేపట్టిన రీసర్వే పై ఫిర్యాదులు వచ్చాయి. అందుకే అటువంటి పరిస్థితి రాకుండా పారదర్శకంగా సర్వే చేపట్టాలని.. భూ యజమానుల సమక్షంలోనే దీనిని పూర్తి చేయాలని యంత్రాంగం భావిస్తుంది. అయితే సర్వే పూర్తి చేసుకున్న గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి రెవెన్యూ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.