Hardik Pandya vs Jasmine: హార్దిక్ పాండ్యాకు టైం బాగున్నట్టు లేదు.. గత ఏడాది చేదు జ్ఞాపకాలు ఉన్నాయనుకుంటే.. ఈ ఏడాది కూడా అతడికి దరిద్రం అతడిని వదిలి పెట్టేటట్టు లేదు.. గత ఏడాది భార్య నటాషా తో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నాడు. విడాకుల కంటే ముందు ముంబై జట్టు కు నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కానీ గ్రూప్ దశలోనే ముంబై జట్టు ఇంటికి వెళ్లిపోయింది. జట్టు విఫల ప్రదర్శన ఒక ఎత్తయితే.. రోహిత్ శర్మ అభిమానుల నుంచి ఎదురైన విమర్శలు మరొక ఎత్తు. ఏకంగా మైదానంలో హార్దిక్ పాండ్యను ఉద్దేశించి రోహిత్ అభిమానులు విమర్శలు చేసేవారు. మైదానంలో రచ్చ రచ్చ చేసేవారు. పాండ్యా అభిమానులపై దాడులకు కూడా పాల్పడ్డారు.. ఇవన్నీ మర్చిపోయి.. ఏదో సరదాగా జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్న తరుణంలో ఈ టీమిండియా స్టార్ ఆటగాడికి గాయని జాస్మిన్ వాలియా పరిచయమైంది. అది కాస్త మరో దశకు వెళ్ళింది. వారిద్దరు కలిసి విహారయాత్రకు వెళ్లినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వారిద్దరు ఒకరిని ఒకరు అనుసరించుకోవడం.. ఒకరి ఫోటోలకు మరొకరు ప్రేమపూర్వకమైన స్పందనలు తెలియజేయడం సంచలనం కలిగించింది.
ఇక ఇటీవల ipl సీజన్లో జాస్మిన్ వాలియా హార్దిక్ ఆడుతున్న మ్యాచ్లకు హాజరైంది. అంతే కాదు ముంబై ఇండియన్స్ జట్టు ప్రయాణించిన బస్సులోను ఆమె కనిపించింది. దీంతో హార్దిక్ జాస్మిన్ బంధం చిక్కబడిందని ప్రచారం జరిగింది. వారిద్దరు ఈ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తారని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. ఏమైందో కూడా తెలియదు.. జాస్మిన్, హార్దిక్ కటీఫ్ చెప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియా కోడై కూడా కూస్తోంది. ఇంతకీ ఇద్దరికీ ఎక్కడ చెడింది? ఇద్దరి మధ్య భేదాభిప్రాయం ఎక్కడ ఏర్పడింది? ఇప్పుడు ఈ విషయాల మీదనే చర్చ జరుగుతోంది.
హార్దిక్ పాండ్యా కు జాస్మిన్ విదేశాలలో పరిచయమైంది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్న వారిద్దరూ ఆ తర్వాత మరింత దగ్గరయ్యారు. అప్పటికే విడాకులు తీసుకున్న హార్దిక్ నిర్వేదంలో ఉన్నాడు. ఈ సమయంలో జాస్మిన్ అతని ఒంటరితనాన్ని దూరం చేసింది. అతడికి దగ్గర అయింది. దీంతో హార్దిక్ కూడా మొదటి వివాహం వల్ల ఏర్పడిన బాధను దూరం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఇంతలో జాస్మిన్ పరిచయం కావడం.. ఆమె కూడా దగ్గర కావడంతో.. హార్దిక్ తన బాధను దూరం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది. కలిసి విదేశాలకు వెళ్లే విధంగా చనువు సొంతమైంది. వారిద్దరూ తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తారు అనుకుంటున్న దశలో ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో రెండో బంధం కూడా బ్రేక్ అయిందని.. హార్దిక్ పాండ్యా దురదృష్టవంతుడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పాపం హార్దిక్ పాండ్యా నీకేంటి ఇలా జరుగుతోందని అతని అభిమానులు వాపోతున్నారు.
ఈసారైనా మంచి బంధం వెతుక్కో. ప్రశాంతంగా ఆలోచించు. నిర్వేదాన్ని దూరం చేసుకో. బాధను పంచుకునే మనిషి కోసం అన్వేషించు. కచ్చితంగా నీకు తగ్గట్టుగా తోడు దొరుకుతారు. పైగా నువ్వు సెలబ్రిటీవి. నిన్ను కావాలని చాలామంది అనుకుంటారు. అందులో ఒక మంచి తోడును ఎంచుకొని జీవితాన్ని కొనసాగించు అని” అభిమానులు సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.