Asia Cup 2025 India Squad: ఇటీవల ఇంగ్లాండ్ దేశంతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో టీమ్ ఇండియా అదరగొట్టింది. ట్రోఫీ సాధించకపోయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, గిల్, జైస్వాల్, సుందర్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, ప్రసిద్ద్ కృష్ణ వంటి వారు ఆకట్టుకున్నారు. వీరంతా కూడా యువ ఆటగాళ్లు. ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభానికి ముందు వీరి మీద పెద్దగా అంచనాలు ఉండేవి కావు. అయితే వారు ఇంగ్లాండ్ సిరీస్ లో తమ అంచనాలకు మించి రాణించారు.
Also Read: 92 పరుగులకే కుప్పకూలింది.. సిరీస్ కోల్పోయింది.. పాక్ ఆట ఈ జన్మలో మారదు..
వీరికి త్వరలో జరిగే ఆసియా కప్ లో చోటు లభిస్తుందని అందరూ అనుకున్నారు.. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొట్టిన ఆటగాళ్లకు చోటు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు.ఆసియా కప్ లో అతడు జట్టును ముందుండి నడిపిస్తాడు.. ఉపసారధి స్థానానికి అక్షర్ పటేల్, గిల్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇటీవల కాలంలో వారిద్దరు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయితే వీరిలో గిల్ కుఉపసారథి స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ కు అవకాశం లభించకపోవచ్చు అని తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం లేకపోవడం వల్ల కె.ఎల్ రాహుల్ కు ఆసియా కప్ లో చోటు దక్కదని తెలుస్తోంది. ఆగస్టు 19 లేదా 20న తూది జట్టును ప్రకటిస్తారని సమాచారం. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 10న యూఏఈ తో జరిగే తొలి మ్యాచ్లో భారత్ తలపడుతుంది.
Also Read: ఐదుగురు పిల్లల్ని కన్న తర్వాత ఎంగేజ్మెంట్..ఈ ఫుట్ బాల్ ఆటగాడు మామూలోడు కాదు..
జట్టుకూర్పు విషయంలో ఇప్పటికే మేనేజ్మెంట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత ఆసియా కప్ ను టీమిండియా సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా టోర్నీలో విజేతగా నిలవాలని భారత జట్టు భావిస్తోంది. ఆసియా కప్ లో భారత్ టైటిల్ ఫేవరెట్ అయినప్పటికీ.. జట్టు కూర్పు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకూడదని మేనేజ్మెంట్ భావిస్తోంది. అందువల్లే ఇటీవలి టి20 టోర్నీలలో అదరగొట్టిన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇచ్చేందుకు మేనేజ్మెంట్ ఆసక్తి చూపిస్తోంది. మొత్తంగా చూస్తే ఇంగ్లాండు సిరీస్లో అదరగొట్టిన ఆటగాళ్లకు ఆసియా కప్ లో చోటు దక్కదని తెలుస్తోంది. మరోవైపు ఆసియా కప్ టోర్నీని టి20 విధానంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో యంగ్ ప్లేయర్లకు మాత్రమే అవకాశాలు దక్కుతాయని సమాచారం.